Actor Vidyut Jammwal: స్టార్‌ హీరో అరెస్ట్‌.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటో! అసలేం జరిగిందంటే..

బాలీవుడ్‌ స్టార్ హీరో విద్యుత్‌ జమ్వాల్‌ను శనివారం (ఫిబ్రవరి 11) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిస్కీ స్టంట్స్‌ చేసినందుకు గానూ నటుడు విద్యుత్‌ జమ్వాల్‌ను ముంబైలోని రైల్వే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైలర్‌ అవుతోంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) బాంద్రా కార్యాలయంలో ఆయన కూర్చోని ఉన్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో హీరో విద్యుత్‌ జమ్వాల్‌..

Actor Vidyut Jammwal: స్టార్‌ హీరో అరెస్ట్‌.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటో! అసలేం జరిగిందంటే..
Vidyut Jammwal
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 11, 2024 | 3:08 PM

ముంబై, ఫిబ్రవరి 11: బాలీవుడ్‌ స్టార్ హీరో విద్యుత్‌ జమ్వాల్‌ను శనివారం (ఫిబ్రవరి 11) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిస్కీ స్టంట్స్‌ చేసినందుకు గానూ నటుడు విద్యుత్‌ జమ్వాల్‌ను ముంబైలోని రైల్వే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైలర్‌ అవుతోంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) బాంద్రా కార్యాలయంలో ఆయన కూర్చోని ఉన్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో హీరో విద్యుత్‌ జమ్వాల్‌ ఆరెస్ట్‌ చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఆయన అరెస్ట్‌ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ మేరకు హలో ముంబై న్యూస్‌ డాట్‌ కమ్‌ తన వెబ్‌సైట్‌లో ఈ కథనాన్ని ప్రచురించింది. ఈ వెబ్‌సైట్‌ ప్రచురించిన కథనం ప్రకారం.. బాంద్రా రైల్వే స్టేసన్‌లోని ప్లాట్‌ ఫాం నెంబర్‌ 1లో ఆర్‌పీఎఫ్‌ ఆఫీస్‌ ఉంది. నటుడు విద్యుత్‌ జమ్యాల్‌ రిస్కీ స్టంట్లు చేసినందుకుగానూ రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు పేర్కొంది. అయితే నటుడు విద్యుత్‌ కానీ, పోలీసులు గానీ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఇది ఎంత వరకు నిజమో తమకు తెలియజేయాలంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Vidyut Jammwal

Vidyut Jammwal

కాగా నటుడు విద్యుత్ జమ్వాల్ స్క్రీన్‌పై అద్భుతమైన విన్యాసాలు చేస్తూ తనదైన గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు అగ్రశ్రేణి మార్షల్ ఆర్టిస్టులలో జమ్వాల్ ఒకరిగా పేరుపొందారు. లూపర్ క్యూరేట్‌ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడుగా జమ్వాల్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. జమ్వాల్‌ ‘క్రాక్ జీతేగా తో జియేగా’ అనే మువీలో నటిస్తున్నాడు. ఈ మువీ ట్రైలర్‌ లాంచ్‌ ప్రోగ్రాం ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ మువీలో అర్జున్ రాంపాల్, నోరా ఫతేహీలతో పాటు మరికొందరు కీలక పాత్రల్లో నటిస్తు్న్నారు. ఆదిత్య దత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మువీని విద్యుత్ జమ్వాల్, అబ్బాస్ సయ్యద్ నిర్మించారు. ఆదిత్య దత్, రెహాన్ ఖాన్, సరిమ్ మోమిన్, మోహిందర్ ప్రతాప్ సింగ్ స్క్రీన్ ప్లే రాశారు. ఇక ఫిబ్రవరి 23 న ఈ మువీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన రియల్‌గానే కొన్ని స్టంట్స్‌ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో విద్యుత్‌ చేసిన కొన్ని స్టంట్లు చూపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.