Kartik Aaryan: 9 రోజులు.. 1000 కిలోమీటర్లు.. స్టార్ హీరోను కలిసేందుకు సైకిల్‌పై వచ్చిన అభిమాని.. వీడియో
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిందీ చిత్ర పరిశ్రమలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన వాళ్లలో కార్తీక్ కూడా ఒకరు. అందుకే బాలీవుడ్‌లో అతనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక అమ్మాయిలు అయితే ఈ హీరో కోసం పడి చచ్చిపోతారు.
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిందీ చిత్ర పరిశ్రమలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన వాళ్లలో కార్తీక్ కూడా ఒకరు. అందుకే బాలీవుడ్‌లో అతనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక అమ్మాయిలు అయితే ఈ హీరో కోసం పడి చచ్చిపోతారు. గతంలో కొందరు అమ్మాయిలు బహిరంగంగానే కార్తీక్ కు ఐలవ్యూ చెప్పారు. అలాగే తమ అభిమాన హీరోను ఎలాగైనా కలవాలంటూ మరికొందరు లేడీ ఫ్యాన్స్ కార్తీక్ ఇంటి ముందు హంగామా నానా హంగామా చేశారు. తాజాగా ఓ వీరాభిమాని కార్తీక్ కు చూడడం కోసం ఏకంగా ఝాన్సీ నుంచి ముంబైకు వచ్చాడు. అది కూడా సైకిల్ తొక్కుకుంటూ. అంటే సుమారు 1000 కిలోమీటర్ల ప్రయాణం. తనను కలిసేందుకు ఎంతో కష్టపడి వచ్చిన ఆ అభిమానిని హీరో కూడా సాదరంగా స్వాగతించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మిమ్మల్ని కలుసుకోవడానికే సార్..
పై ఫొటోలో ఉన్నది కార్తీక్‌తో ఉన్నది అతని వీరాభిమాని. ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతానికి చెందినవాడు. కార్తీక్ అంటే పడి చస్తాడు. ఎలాగైనా తమ హీరోను కలవాలనుకున్నాడు. అందుకే తన స్వస్థలం నుంచి సైకిల్ తొక్కుకుంటూ ముంబైకి వచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 9 రోజులు.. 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి ముంబై లోని కార్తీక్ ఇంటికి చేరుకున్నాడు. తన ఇంటి బయట ఉన్న అభిమానిని చూసిన కార్తీక్ అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. కానీ ఆ డై హార్డ్ ఫ్యాన్ మాత్రం హీరో పాదాలకు నమస్కరించాడు. దీంతో అతడిని అలా చేయొద్దంటూ అభిమానికి చెప్పిన కార్తీక్ తనతో కలిసి ఫొటో దిగాడు. ఈ సందర్భంగా అంత దూరం నుంచి సైకిల్‌పై ఎలా వచ్చావని అభిమానిని అడిగాడు కార్తీక్. అందుకు ఆ డై హార్డ్ ఫ్యాన్.. ‘కేవలం మిమ్మల్ని కలుసుకోవడానికే ఊరి నుంచి వెయ్యికిపైగా కిలోమీటర్లు ఈ సైకిల్ తొక్కుకుంటూ వచ్చేశాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం చందూ ఛాంపియన్ అనే సినిమాలో నటిస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు.
అభిమానితో మాట్లాడుతున్న కార్తీక్ ఆర్యన్..
View this post on Instagram
తన లేటెస్ట్ మూవీ షూటింగ్ సెట్ లో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.