AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: తన భార్యకు షారుఖ్ ఖాన్ ఇచ్చిన ఫస్ట్ వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా ?.. ఏం చేప్పారంటే..

షూటింగ్స్ నుంచి కాస్త విరామం దొరికితే కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక ఆయన భార్య గౌరీ ఖాన్ అతడి కెరీర్ కు మద్దతు ఇస్తుంది. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ లది ప్రేమ వివాహం. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇప్పుడు షారుక్ ఖాన్ సూపర్ స్టార్. ఇదిలా ఉంటే.. షారుఖ్ లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. ఎప్పుడూ బాద్ షా సైతం తన ప్రేమకథను బయటపెట్టలేదు. కానీ తాజాగా తన భార్యకు వాలెంటైన్స్ రోజున ఇచ్చిన గిఫ్ట్ గురించి బయటపెట్టాడు.

Shah Rukh Khan: తన భార్యకు షారుఖ్ ఖాన్ ఇచ్చిన ఫస్ట్ వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా ?.. ఏం చేప్పారంటే..
Shah Rukh Khan
Rajitha Chanti
| Edited By: TV9 Telugu|

Updated on: Feb 14, 2024 | 1:46 PM

Share

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. గతేడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత డంకీ సినిమాతో మరోసారి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న బాద్ షా.. అటు తన ఫ్యామిలీకి కూడా ఇంపార్టెంట్స్ ఇస్తారు. షూటింగ్స్ నుంచి కాస్త విరామం దొరికితే కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక ఆయన భార్య గౌరీ ఖాన్ అతడి కెరీర్ కు మద్దతు ఇస్తుంది. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ లది ప్రేమ వివాహం. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇప్పుడు షారుక్ ఖాన్ సూపర్ స్టార్. ఇదిలా ఉంటే.. షారుఖ్ లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. ఎప్పుడూ బాద్ షా సైతం తన ప్రేమకథను బయటపెట్టలేదు. కానీ తాజాగా తన భార్యకు వాలెంటైన్స్ రోజున ఇచ్చిన గిఫ్ట్ గురించి బయటపెట్టాడు.

సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు షారుఖ్. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. గతేడాది ప్రేమికుల రోజున అభిమానులతో నిర్వహించిన చిట్ చాట్ షారుఖ్ కు ఊహించని ప్రశ్న ఎదురైంది. గౌరీ మేడమ్‌కి మీరు ప్రేమికుల రోజున ఇచ్చిన మొదటి బహుమతి ఏమిటి ? అని ఓ నెటిజన్ అడగ్గా.. షారుఖ్ స్పందిస్తూ.. “నాకు సరిగ్గా గుర్తులేదు.. ఇప్పటికే 34 ఏళ్లు గడిచిపోయాయి. నాకు తెలిసి ఒక పింక్ ప్లాస్టిక్ ఇయర్ రింగ్స్ గిఫ్ట్ ఇచ్చాను” అంటూ రిప్లై ఇచ్చారు. ఇక బాద్ షా ఆన్సర్ కు భిన్నరకాల కామెంట్స్ వచ్చాయి.

వావ్ చాలా క్యూట్ సార్. మీరు ఇచ్చినది ప్లాస్టిక్ బహుమతి కానీ వాటి విలువ అనంతం.. ఇప్పుడు కావాలంటే డైమండ్ రింగ్ ఇవ్వొచ్చు’ అని అభిమాని కామెంట్ చేశారు. షారుక్ ఖాన్ తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఆ పరిస్థితులన్నింటిలోనూ గౌరీ ఖాన్‌ అతనికి అండగా నిలిచింది. ఆమె నిర్మాత మరియు ఇంటీరియర్ డిజైనర్‌గా గుర్తింపు పొందింది. షారుఖ్ పిల్లలు సుహానా ఖాన్ మరియు ఆర్యన్ ఖాన్ కూడా చిత్ర పరిశ్రమలో చురుకుగా ఉన్నారు. కుమార్తెకు నటనపై ఆసక్తి ఉంటే, కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంపై ఆసక్తి చూపుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..