AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: పాక్ బ్యాటర్‌కు ఫైరీ సెండాఫ్.. గంభీర్ శిష్యుడికి ఐసీసీ శిక్ష తప్పదా?

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో పాకిస్తాన్ బ్యాటర్ షమైల్ హుస్సేన్‌కు టీమిండియా పేసర్ హర్షిత్ రాణా ఇచ్చిన ఫైరీ సెండాఫ్ తీవ్ర దుమారం రేపుతోంది. ఐసీసీ కోడ్ ఉల్లంఘనపై అతడికి శిక్ష పడుతుందా? ఇండియా ఎ వర్సెస్ పాకిస్తాన్ షాహీన్స్ మ్యాచ్‌లో జరిగిన ఈ ఘటనపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

IND vs PAK: పాక్ బ్యాటర్‌కు ఫైరీ సెండాఫ్.. గంభీర్ శిష్యుడికి ఐసీసీ శిక్ష తప్పదా?
Harshit Rana
Venkata Chari
|

Updated on: Nov 22, 2026 | 8:22 PM

Share

IND vs PAK: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్‌లో ఇండియా ఎ వర్సెస్ పాకిస్తాన్ షాహీన్స్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అయితే మ్యాచ్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా.. పాకిస్తాన్ ఓపెనర్ షమైల్ హుస్సేన్‌కు ఇచ్చిన దూకుడు సెండాఫ్ వివాదాస్పదంగా మారింది. దీంతో హర్షిత్ రాణాపై ఐసీసీ చర్యలు తీసుకుంటుందా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.

ఆయుష్ బదోని బౌలింగ్‌లో షమైల్ హుస్సేన్ కొట్టిన బంతికి హర్షిత్ రాణా అద్భుత క్యాచ్ పట్టి అతడిని ఔట్ చేశాడు. వికెట్ తీసిన ఆనందంలో రాణా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. పెవిలియన్ వైపు వెళ్తున్న షమైల్ హుస్సేన్‌ను ఉద్దేశించి గట్టిగా అరుస్తూ, చేత్తో పెవిలియన్ వైపు చూపిస్తూ వెళ్లిపొమ్మన్నట్లుగా సంజ్ఞ చేశాడు.

అంతకుముందు ఇన్నింగ్స్‌లోనే వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో క్యాచ్ పట్టిన తర్వాత రాణా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పెవిలియన్‌కు వెళ్తున్న బ్యాటర్‌పై నోరు పారేసుకున్నట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

ICC నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం.. ఔట్ అయిన బ్యాటర్‌ను రెచ్చగొట్టడం, దూషించడం, అనుచిత సంజ్ఞలు చేయడం నిషేధం. ప్రత్యర్థిని ఉద్దేశించి దుర్భాషలాడటం, దూకుడుగా సెండాఫ్ ఇవ్వడం నేరుగా ఉల్లంఘన కిందకే వస్తుంది.

హర్షిత్ రాణా వ్యవహారం చూస్తే.. అతడు foul language వాడినట్లు కనిపిస్తోంది. కాబట్టి ఐసీసీ అతడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం బలంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మ్యాచ్ రిఫరీతో జరిగే విచారణలో రాణా తన తప్పును అంగీకరిస్తే తక్కువ శిక్షతో బయటపడే అవకాశం ఉంది. లేదంటే జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్లు పడే ఛాన్స్ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అతడికి శిక్ష తప్పకపోవచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

హర్షిత్ రాణా రిపీటెడ్ అఫెండర్!

గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇది హర్షిత్ రాణాకు మొదటి తప్పు కాదు. గతంలో కూడా దూకుడు సెండాఫ్‌లతో అతడు వార్తల్లో నిలిచాడు.

డిసెంబర్ 25న దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో డెవాల్డ్ బ్రెవిస్‌ను ఔట్ చేసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లాలంటూ సంజ్ఞ చేశాడు. ఆ ఘటనలో ఆర్టికల్ 2.5 ఉల్లంఘన కింద అతడికి ఒక డీమెరిట్ పాయింట్ పడింది.

గతంలో శిక్ష పడిన నేపథ్యంలో తాజా ఘటనపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. పాత నేరం కారణంగా నేరుగా కఠిన శిక్ష పడకపోయినా.. మ్యాచ్ రిఫరీ నిర్ణయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి హర్షిత్ రాణా విషయంలో ఐసీసీ తీర్పు కోసం అభిమానులు వేచి చూడాల్సిందే.

Follow Us
పాక్ బ్యాటర్‌కు ఫైరీ సెండాఫ్.. గంభీర్ శిష్యుడికి ఐసీసీ?
పాక్ బ్యాటర్‌కు ఫైరీ సెండాఫ్.. గంభీర్ శిష్యుడికి ఐసీసీ?
టేస్టీ టేస్టీ ఘాటైన చికెన్ కర్రీ.. ఇలా వండితే ముక్కకూడా మిగలదు
టేస్టీ టేస్టీ ఘాటైన చికెన్ కర్రీ.. ఇలా వండితే ముక్కకూడా మిగలదు
థైరాయిడ్ ఉన్నవారు మధ్యాహ్నం నిద్రపోతున్నారా? అయితే జాగ్రత్త
థైరాయిడ్ ఉన్నవారు మధ్యాహ్నం నిద్రపోతున్నారా? అయితే జాగ్రత్త
బుర్రపాడు చేసే స్టోరీ..OTT టాప్ ట్రెండింగ్‌లో సర్వైవల్ థ్రిల్లర్
బుర్రపాడు చేసే స్టోరీ..OTT టాప్ ట్రెండింగ్‌లో సర్వైవల్ థ్రిల్లర్
ఇద్దరన్నదమ్ములు.. 3 మామిడిపండ్లను సమానంగా ఎలా తిన్నారో తెలుసా?
ఇద్దరన్నదమ్ములు.. 3 మామిడిపండ్లను సమానంగా ఎలా తిన్నారో తెలుసా?
వచ్చేస్తున్నాయ్‌.. పాడ్‌ కార్స్‌ ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్
వచ్చేస్తున్నాయ్‌.. పాడ్‌ కార్స్‌ ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్
ఏఐతో పెరగనున్న నిరుద్యోగం ..? ప్రభుత్వ సంక్షేమ పథకాలే దిక్కా
ఏఐతో పెరగనున్న నిరుద్యోగం ..? ప్రభుత్వ సంక్షేమ పథకాలే దిక్కా
విమానాశ్రయంలో లగేజీ బ్యాగులపై గోధుమ రంగు జిగట పదార్థం! ఏంటది?
విమానాశ్రయంలో లగేజీ బ్యాగులపై గోధుమ రంగు జిగట పదార్థం! ఏంటది?
గుండె డాక్టర్ అరుదైన రికార్డ్...
గుండె డాక్టర్ అరుదైన రికార్డ్...
బట్టల దుకాణంలో వీధికుక్కలకు ఆశ్రయం.. యజమాని పెద్ద మనసు
బట్టల దుకాణంలో వీధికుక్కలకు ఆశ్రయం.. యజమాని పెద్ద మనసు