Abraham Ozler OTT: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

ప్రస్తుతం మమ్ముట్టి నటించిన యాత్ర2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తోంది. థియేటర్ల మమ్ముట్టి నటించిన ఒక మలయాళ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అదే అబ్రహం ఓజ్లర్‌. సైకలాజికల్‌ మెడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ మూవీలో అల వైకుంఠపురం మూవీ ఫేమ్‌ జయరాం మెయిన్‌ రోల్‌. అయితే మమ్ముట్టి సీరియల్‌ కిల్లర్‌గా ఓ స్పెషల్‌ రోల్‌లో కనిపించారు

Abraham Ozler OTT: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
Abraham Ozler Movie
Follow us

|

Updated on: Feb 10, 2024 | 9:53 PM

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టికి తెలుగులోనూ అభిమానులున్నారు. అందుకే ఆయన నటించిన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా రిలీజవుతుంటాయి. సూపర్‌ హిట్‌గా నిలుస్తుంటాయి. ప్రస్తుతం మమ్ముట్టి నటించిన యాత్ర2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తోంది. థియేటర్ల మమ్ముట్టి నటించిన ఒక మలయాళ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అదే అబ్రహం ఓజ్లర్‌. సైకలాజికల్‌ మెడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ మూవీలో అల వైకుంఠపురం మూవీ ఫేమ్‌ జయరాం మెయిన్‌ రోల్‌. అయితే మమ్ముట్టి సీరియల్‌ కిల్లర్‌గా ఓ స్పెషల్‌ రోల్‌లో కనిపించారు. గతేడాది డిసెంబర్‌ 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో సందడి చేసిన అబ్రహం ఓజ్లర్‌ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (ఫిబ్రవరి 09) నుంచి అబ్రహం ఓజ్లర్‌ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

అబ్రహం ఓజ్లర్‌ సినిమాకు మిధున్ మాన్యుల్ థామస్ దర్శకత్వం వహించారు. అనశ్వర రాజన్, అర్జున్ అశోకన్, అనూప్ మీనన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. ఇక అలెగ్జాండర్‌ జోసెఫ్‌ అనే సీరియల్‌ కిల్లర్‌ పాత్రలో మమ్ముట్టి అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. అబ్రహం (జయరాం) భార్య పిల్లలు అపహరణకు గురవుతారు. అయితే వారు కనిపించకుండాపోయినా తన దగ్గరే ఉన్నట్లు అబ్రహం ఊహించుకుంటాడు. ఇదే నేపథ్యంలో కొందరు వ్యక్తులు వరుసగా హత్యలకు గురవుతుంటారు. మృతుల వద్ద హ్యాపీ బర్త్‌ డే అంటూ రక్తంతో రాసి ఉన్న పేపర్లు లభ్యమవుతాయి. మరి వారిని చంపిందెవరు? అలెక్స్‌ (మమ్ముట్టి) కిల్లర్‌గా మారడానికి కారణమేంటో తెలుసుకోవాలంటే అబ్రహం ఓజ్లర్‌ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

భారీ కలెక్షన్లు రాబట్టిన అబ్రహం ఓజ్లర్..

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..