Bhakshak OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. ‘భక్షక్‌’ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

బాలీవుడ్ ప్రముఖ న‌టి భూమి పెడ్నేకర్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం భక్షక్‌. పులకిత్‌ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ డ్రామాలో ఈ చిత్రంలో సంజయ్‌ మిశ్రా, ఆదిత్య శ్రీవాస్తవ, సాయి తమ్‌హంకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కంటెంట్‌ ఆసక్తికరంగా ఉండడంతో షారుక్‌ ఖాన్‌ తన సొంత బ్యాన‌ర్ రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై భక్షక్‌ సినిమాను నిర్మించడం విశేషం

Bhakshak OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. 'భక్షక్‌' స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Bhakshak Movie
Follow us

|

Updated on: Feb 09, 2024 | 7:57 PM

బాలీవుడ్ ప్రముఖ న‌టి భూమి పెడ్నేకర్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం భక్షక్‌. పులకిత్‌ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ డ్రామాలో ఈ చిత్రంలో సంజయ్‌ మిశ్రా, ఆదిత్య శ్రీవాస్తవ, సాయి తమ్‌హంకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కంటెంట్‌ ఆసక్తికరంగా ఉండడంతో షారుక్‌ ఖాన్‌ తన సొంత బ్యాన‌ర్ రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై భక్షక్‌ సినిమాను నిర్మించడం విశేషం. టీజర్స్‌, ట్రైలర్లతోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. శుక్రవారం (ఫిబ్రవరి 09) అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ లో భక్షక్‌ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని చిత్రబృందంతో పాటు నెట్ ఫ్లిక్స్‌ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. కాగా నిజ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని చేసుకుని భక్షక్‌ సినిమాను తెరకెక్కించినట్లు నిర్మాత షారుక్‌ ఖాన్‌ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ లో చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

భక్షక్‌ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. వసతి గృహాల్లో ఉండే అనాధ అమ్మాయిలు వరుసగా అత్యాచారానికి గురవుతుంటారు. ఒక లోకల్‌ రౌడీ (ఆదిత్య శ్రీ వాస్తవ) ఈ మాఫియాను నిర్వహిస్తుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్తు వైశాలి (భూమి పడ్నేకర్‌) వాటిని బయట పెట్టేందుకు ప్రయత్నిస్తుంటుంది. మరి బాలికలు, మహిళలలపై జరుగుతున్న నేరాలను వైశాలి ఎలా గుర్తించింది? ఆధారాలతో సహా వాటిని ఎలా వెలుగులోకి తెచ్చింది? ఈ నేపథ్యంలో వైశాలి ఎలాంటి సవాళ్లు, ఇబ్బందులు ఎదుర్కొందో తెలుసుకోవాలంటే భక్షక్‌ సినిమాను చూడాలంటున్నారు మేకర్స్. మరి ఇంకెందుకు లేటు. ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీస్ చూడాలనుకునేవారికి భక్షక్ ఒక మంచి చాయిస్‌.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

భక్షక్ ట్రైలర్..