AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Captain Miller OTT: ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే..

సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళంలో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ అప్పుడే శివకార్తికేయన్ నటించిన అయలాన్ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోవడంతో కెప్టెన్ మిల్లర్ వెనకబడింది. ఈ చిత్రానికి అరుణ్ మతీశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాటలు, ట్రైలర్‌కి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతుండగా సంక్రాంతి సందర్భంగా కేవలం తమిళంలోనే రిలీజ్ అయ్యింది.

Captain Miller OTT: ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ 'కెప్టెన్ మిల్లర్'.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే..
Captain Miller OTT
Rajitha Chanti
|

Updated on: Feb 09, 2024 | 8:08 AM

Share

పాన్ ఇండియా లెవల్లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో ధనుష్. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇటీవలే కెప్టెన్ మిల్లర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. తిరుచిర్తంబళం, సార్ సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్న ధనుష్.. కెప్టెన్ మిల్లర్ సినిమాతోనే మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళంలో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ అప్పుడే శివకార్తికేయన్ నటించిన అయలాన్ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోవడంతో కెప్టెన్ మిల్లర్ వెనకబడింది. ఈ చిత్రానికి అరుణ్ మతీశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాటలు, ట్రైలర్‌కి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతుండగా సంక్రాంతి సందర్భంగా కేవలం తమిళంలోనే రిలీజ్ అయ్యింది. ఫస్ట్ డే మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఆమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా గత అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు నేరుగా ఓటీటీలో చూడొచ్చు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందించగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తదితరులు కీలకపాత్రలలో నటించారు.

అయితే ఈ సినిమా హిందీలో స్ట్రీమింగ్ కాలేదు. నిజానికి ధనుష్ కు ఉత్తరాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో ఆత్రంగి రే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ధనుష్. ఇందులో సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఆయనకు నార్త్ లో ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఇక ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ సినిమా హిందీలో అందుబాటులోకి రాకపోవడంతో బాలీవుడ్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భర్తను చంపేందుకు భార్య భయానక కుట్ర..!
భర్తను చంపేందుకు భార్య భయానక కుట్ర..!
వారికి అదృష్ట కాలం.. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ పక్కా..!
వారికి అదృష్ట కాలం.. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ పక్కా..!
చిటికెలో శరీరం మొత్తం యాక్టీవ్ అవ్వాలంటే ఒంట్లో ఇవి పడాల్సిందే..
చిటికెలో శరీరం మొత్తం యాక్టీవ్ అవ్వాలంటే ఒంట్లో ఇవి పడాల్సిందే..
'ది ప్యారడైజ్'పై రూ.110 కోట్ల రూమర్స్... మేకర్స్ ఇచ్చిన క్లారిటీ
'ది ప్యారడైజ్'పై రూ.110 కోట్ల రూమర్స్... మేకర్స్ ఇచ్చిన క్లారిటీ
ఛీ.. ఇదేం వరల్డ్ కప్ ఫార్మాట్! ఐసీసీపై కెప్టెన్ల మండిపాటు
ఛీ.. ఇదేం వరల్డ్ కప్ ఫార్మాట్! ఐసీసీపై కెప్టెన్ల మండిపాటు
'లెనిన్'తో మారిన అఖిల్... ఇప్పుడు మొదలైంది అసలైన 2.0 జర్నీ..!
'లెనిన్'తో మారిన అఖిల్... ఇప్పుడు మొదలైంది అసలైన 2.0 జర్నీ..!
కలలో చనిపోయిన వారు కనిపిస్తే అర్థం ఏమిటి? స్వప్న శాస్త్రం చెప్పే
కలలో చనిపోయిన వారు కనిపిస్తే అర్థం ఏమిటి? స్వప్న శాస్త్రం చెప్పే
పాము కాటుకు చికిత్స రూ.11కోట్లు,ఆస్పత్రి బిల్లుతో బాధితుడికి షాక్
పాము కాటుకు చికిత్స రూ.11కోట్లు,ఆస్పత్రి బిల్లుతో బాధితుడికి షాక్
దేశంలో ఒక్క చోట కూడా ఆగకుండా 70 స్టేషన్ల మీదుగా వెళ్లే ఏకైక రైలు
దేశంలో ఒక్క చోట కూడా ఆగకుండా 70 స్టేషన్ల మీదుగా వెళ్లే ఏకైక రైలు
గుండెల్ని పిండేసే ఘటన.. భార్య మీద కోపంతో పసిప్రాణాన్ని..
గుండెల్ని పిండేసే ఘటన.. భార్య మీద కోపంతో పసిప్రాణాన్ని..