Naa Saami Ranga OTT: అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఓటీటీలో నాగ్‌ ‘నా సామిరంగ’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ముఖ కొరియో గ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ తెరకెక్కించిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్ లో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ కథానాయికగా నటించింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా, రుక్సాన్ థిల్లన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాతి కానుకగా జనవరి 14న రిలీజైన నా సామిరంగ అంచనాలకు మించి కలెక్షన్లు రాణించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఈ మూవీ బాగా మెప్పించింది

Naa Saami Ranga OTT: అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఓటీటీలో నాగ్‌ 'నా సామిరంగ'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Naa Saamiranga Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 10, 2024 | 2:47 PM

టాలీవుడ్‌ మన్మథుడు అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం నా సామిరంగ. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా సూపర్‌ హిట్‌ గా నిలిచింది. యాక్షన్‌ ప్రియులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించింది. క్లీన్‌ హిట్‌ గా నిలిచింది. ప్రముఖ కొరియో గ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ తెరకెక్కించిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్ లో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ కథానాయికగా నటించింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా, రుక్సాన్ థిల్లన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాతి కానుకగా జనవరి 14న రిలీజైన నా సామిరంగ అంచనాలకు మించి కలెక్షన్లు రాణించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఈ మూవీ బాగా మెప్పించింది. దీంతో నా సామిరంగ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆడియెన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో ఆడియెన్స్‌ను మెప్పించిన నా సామిరంగ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌ నాగ్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఫిబ్రవరి 17 నుంచి నా సామిరంగ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ‘మరో వారం రోజుల్లో కింగ్‌ సినిమాను ఓటీటీలో చూడొచ్చు’ అంటూ ట్వీట్‌ చేసింది డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌.

‘నా సామిరంగ’ మూవీలో నాజర్‌, మలయాళ నటుడు షబ్బీర్‌ కలరక్కాల్‌, రవి వర్మ, రావు రమేశ్‌, మధు సూదన్‌ రావ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చాలా రోజుల తర్వాత ఆస్కార్‌ విజేత కీరవాణి నాగార్జున సినిమాకు స్వరాలు అందించడం విశేషం. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నా సామిరంగ సినిమాను నిర్మించారు. మరి థియేటర్లలో నా సామిరంగ సినిమాను మిస్‌ అయ్యారా? లేదా మరోసారి నాగార్జున మాస్‌ హంగామా చూడాలనుకుంటున్నారా? అయితే వారం రోజులు వెయిట్‌ చూడండి. ఎంచెక్కా ఓటీటీలోకి వస్తుంది.

ఇవి కూడా చదవండి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోకి అందుబాటులో..

మరో వారం రోజుల్లో స్ట్రీమింగ్ ..

ఓన్లీ కింగ్ వైబ్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే