Malaikottai Vaaliban OTT: ఓటీటీలోకి మోహన్‌ లాల్‌ పీరియాడికల్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాన్‌ నటించిన తాజా చిత్రం మలైకోటై వాలిబన్‌. లిజో జోస్ పెల్లిసరీ తెరెక్కించిన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ లో సోనాలీ కులకర్ణి, హరీశ్‌ పేరడీతో సహా పలువురు ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు.

Malaikottai Vaaliban OTT: ఓటీటీలోకి మోహన్‌ లాల్‌ పీరియాడికల్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
Malaikottai Vaaliban Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 10, 2024 | 6:06 PM

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాన్‌ నటించిన తాజా చిత్రం మలైకోటై వాలిబన్‌. లిజో జోస్ పెల్లిసరీ తెరెక్కించిన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ లో సోనాలీ కులకర్ణి, హరీశ్‌ పేరడీతో సహా పలువురు ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్స్‌, పోస్టర్స్‌, ట్రైలర్లతోనే ఆసక్తిని రేకెత్తించిన మలైకోటై వాలిబన్‌ తీరా థియేటర్లలోకి వచ్చాక పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా రిలీజైన ఈ మూవీ మిక్స్‌ డ్‌ టాక్‌ తెచ్చుకుంది. తెలుగులోనూ అదే పేరుతో రిలీజైనా ఇక్కడ కూడా పెద్దగా రెస్పాన్స్‌ రాలేకపోయింది. అయితే మోహన్‌లాల్‌ నటన, అలాగే సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో యావరేజ్‌ గా నిలిచిన మలైకోటై వాలిబన్‌ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి మలైకోటై వాలిబన్‌ను స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇక మలైకోటై వాలిబన్‌ సినిమా కథ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా పీరియాడికల్‌ మూవీ. ‘మలైకోట్టై వాలిబన్’ అంటే ‘మలై కోట్టై ప్రాంతానికి చెందిన యువకుడు’ అని అర్థం. దీనికి తగ్గట్టుగానేన బ్రిటిష్‌ పాలకుల నుంచి స్వాతంత్య్రం కోసం మలైకోటై ప్రాంత ప్రజలు ఎలాంటి పోరాటం చేశారన్న నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. కుస్తీ యోధుడు వాలిజన్‌ పాత్రలో మోహన్‌ లాల్‌ అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాను ఇండియాలో సెంచురీ ఫిల్మ్స్, ఓవర్సీస్‌లో ఫార్ ఫిల్మ్ కంపెనీ, ఆశీర్వాద్ సినిమాస్ కో ఎల్ఎల్సీ నిర్మించాయి.

ఇవి కూడా చదవండి

మలైకోటై వాలిబన్ లో మోహన్ లాల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.