Balagam Venu: ‘నా ‘బలగం’ సినిమాను మా నాయన తప్ప అందరూ చూశారు.. డైరెక్టర్‌ వేణు ఎమోషనల్

జబర్దస్త్‌ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. తనదైన ప్రాసలు, పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. మున్నా వంటి స్టార్‌ హీరోల సినిమాల్లోనూ మెరిశాడు. అయితే ఆ మధ్యన ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో ఉండిపోయాడు. కట్ చేస్తే బలగం వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో వెలుగులోకి వచ్చాడు.

Balagam Venu: 'నా 'బలగం' సినిమాను మా నాయన తప్ప అందరూ చూశారు.. డైరెక్టర్‌ వేణు ఎమోషనల్
Balagam Venu
Follow us

|

Updated on: Feb 08, 2024 | 5:55 PM

జబర్దస్త్‌ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. తనదైన ప్రాసలు, పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. మున్నా వంటి స్టార్‌ హీరోల సినిమాల్లోనూ మెరిశాడు. అయితే ఆ మధ్యన ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో ఉండిపోయాడు. కట్ చేస్తే బలగం వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో వెలుగులోకి వచ్చాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ రికార్డులు కొల్లగొట్టింది. తెలంగాణలోని సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ వేణు తెరకెక్కించిన బలగం సినిమాకు కలెక్షన్లతో పాటు  అంతర్జాతీయంగా అవార్డులు, ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఇదిలా ఉంటే తన తండ్రి వర్ధంతి రోజున ఎమోషనల్ అయ్యాడు వేణు. నాన్నను గుర్తుకుచేసుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా తండ్రి చిత్ర పటాన్ని షేర్ చేసిన వేణు.. ‘ నా ‘బ‌ల‌గం’ సినిమా అందరూ చూశారు.. మా నాన్న తప్ప.. మిస్ యూ నాయన‌’  అంటూ ఎమోషనల్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం యెల్దండి వేణు షేర్ చేసిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. ఆయన ఎక్కడున్నా నీ విజయాన్ని చూసి చాలా సంతోషంగా ఉంటారంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. వేణు తన తర్వాతి సినిమాను న్యాచురల్ స్టార్ నానితో చేయనున్నట్లు తెలుస్తోంది. ఎల్లమ్మ అనే టైటిల్ కూడా పరిశీలనతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మేక‌ర్స్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

తండ్రిని గుర్తుచేసుకుని ఎమోషనల్..

మెగాస్టార్ చిరంజీవితో బలగం వేణు..

బలగం సింగర్ దాసరి కొండప్పకు పద్మశ్రీ.. వేణు అభినందనలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..