AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumari Aunty: ‘ఎన్టీఆర్, అలీ మా కర్రీస్ తీసుకెళ్లారు’.. టిఫిన్ చేసి సందీప్‌ కిషన్ ఎంతిచ్చాడో చెప్పిన కుమారీ ఆంటీ

ప్రస్తుతం నగరం చుట్టుపక్కల నుంచి జనాలు కుమారీ ఆంటీ చేతి వంట రుచి చూసేందుకు ఎగబడుతున్నారు. ఇన్‌స్టా గ్రామ్‌, ఫేస్‌ బుక్‌, యూట్యూబ్‌.. ఎక్కడ చూసినా కుమారీ ఆంటీ ఫుడ్‌ స్టాల్ వీడియోలే దర్శనమిస్తున్నాయి. యూట్యూబర్లతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా ఆమె ఇంటర్వ్యూల కోసం పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి

Kumari Aunty: 'ఎన్టీఆర్, అలీ మా కర్రీస్ తీసుకెళ్లారు'.. టిఫిన్ చేసి సందీప్‌ కిషన్ ఎంతిచ్చాడో చెప్పిన కుమారీ ఆంటీ
Kumari Aunty
Basha Shek
|

Updated on: Feb 06, 2024 | 9:02 PM

Share

సోషల్‌ మీడియా పుణ్యమా అని కుమారీ ఆంటీ క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. సాక్షాత్తూ సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించడంతో ఆమె పేరు నెట్టింట మార్మోగిపోతోంది. ప్రస్తుతం నగరం చుట్టుపక్కల నుంచి జనాలు కుమారీ ఆంటీ చేతి వంట రుచి చూసేందుకు ఎగబడుతున్నారు. ఇన్‌స్టా గ్రామ్‌, ఫేస్‌ బుక్‌, యూట్యూబ్‌.. ఎక్కడ చూసినా కుమారీ ఆంటీ ఫుడ్‌ స్టాల్ వీడియోలే దర్శనమిస్తున్నాయి. యూట్యూబర్లతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా ఆమె ఇంటర్వ్యూల కోసం పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కుమారీ ఆంటీ.. పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా తన ఫుడ్‌ స్టాల్‌ నుంచి కర్రీస్‌ తీసుకెళ్లారని తెలిపింది. గత 13 ఏళ్లుగా ఆమె ఈ వ్యాపారం చేశానని, హోటల్‌ పెట్టక ముందు ప్రముఖ సింగర్ హేమ చంద్ర ఇంట్లో వంట మనిషిగా చేశానని అప్పటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, అలీ కూడా తన కస్టమర్లేనని, వారు తన ఫుడ్‌ స్టాల్‌ నుంచి కర్రీస్‌ పట్టుకెళ్లారని తన ఫుడ్‌ బిజినెస్‌ గురించి చెప్పుకొచ్చిందామె.

ఇవి కూడా చదవండి

ఇటీవల సందీప్‌ కిషన్‌ తన లేటెస్ట్‌ మూవీ ఊరి పేరు భైరవ కోన మూవీ ప్రమోషన్లలో భాగంగా కుమారీ ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ను సందర్శించారు. హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ తదితరులతో కలిసి అక్కడకు వచ్చిన సందీప్‌ ఇక్కడ టేస్టీ ఫుడ్‌ను ఆస్వాదించి వెళ్లారట. ఇందుకు గానూ కుమారీ ఆంటీ చేతిలో పదివేలు పెట్టాడట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్నారని పోలీసులు కుమారీ ఆంటీ స్టాల్‌ను క్లోజ్‌ చేయించినప్పుడు సందీప్ కిషన్‌ ఆమెకు మద్దతుగా ట్వీట్‌ చేశాడు. కుమారీ ఆంటీకి తన చేతనైన సాయం చేస్తానంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. అలాగే ఆమె ఫుడ్‌ స్టాల్‌ను రీ ఓపెన్‌ చేయించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలిపాడీ యంగ్‌ హీరో.

కుమారీ ఆంటీకి మద్దతుగా సందీప్ కిషన్ ట్వీట్..

కుమారీ ఆంటీ స్టాల్ వద్ద భోజనం చేస్తోన్న సందీప్ కిషన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..