AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీ లవర్స్‌కు పండగే .. ఒకే రోజు 4 సూపర్‌ హిట్‌ మూవీస్‌.. ఏది ఎక్కడ చూడాలంటే?

సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలోకి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే విక్టరీ వెంకటేశ్‌ నటించిన సైంధవ్‌ గత శనివారం (ఫిబ్రవరి 3) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఇతర సినిమాలు కూడా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి.

OTT Movies: ఓటీటీ లవర్స్‌కు పండగే .. ఒకే రోజు 4 సూపర్‌ హిట్‌ మూవీస్‌.. ఏది ఎక్కడ చూడాలంటే?
OTT Movies
Basha Shek
|

Updated on: Feb 05, 2024 | 8:47 PM

Share

సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలోకి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే విక్టరీ వెంకటేశ్‌ నటించిన సైంధవ్‌ గత శనివారం (ఫిబ్రవరి 3) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఇతర సినిమాలు కూడా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు నటించిన మాస్‌ మసాలా మూవీ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి మిక్స్‌ డ్‌ టాక్‌ వచ్చింది. అయితే ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మహేశ్‌ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్‌ చేసింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 9 నుంచి గుంటూరు కారం సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

ఇక ఫిబ్రవరి 9నే మరో మూడు సూపర్‌ హిట్ సినిమాలు ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నాయి. సంక్రాంతికి తమిళంలో రిలీజై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో సందడి చేస్తోన్న ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌ కూడా ఫిబ్రవరి 9నే ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇదే సంక్రాంతికి తమిళంలో రిలీజైన అయలాన్‌ కూడా ఫిబ్రవరి 9నే స్ట్రీమింగ్‌ కు రానుంది. ఇది సన్‌ నెక్ట్స్‌లో అందుబాటులోకి రానుంది. ఇక ప్రభాస్‌ సలార్‌ సినిమాకు పోటీగా రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించిన దర్శన్‌ సినిమా కాటేరా కూడా ఫిబ్రవరి 9నే ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో జీ5 తో కన్నడతో పాటు తెలుగు భాషలోనూ కాటేరా స్ట్రీమింగ్‌ కు రానుంది. మొత్తానికి ఫిబ్రవరి 9న ఓటీటీ ప్రియులకు సినిమా పండగే అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!