Taraka Ratna: ‘తాతయ్యా’.. విజయసాయి రెడ్డిని చూడగానే చుట్టిముట్టిన తారక రత్న పిల్లలు.. హార్ట్ టచింగ్‌ వీడియో

తారక రత్న మరణించి ఏడాది కావొస్తున్నా.. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయన జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇక తారక రత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న అలేఖ్య నిత్యం తారక రత్న జ్ఞాపకాలతోనే జీవితం గడిపేస్తోంది. అప్పుడప్పుడు తారకరత్నతో తనకున్న మధుర జ్ఞాపకాలను సోషల్‌ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసుకుంటోంది.

Taraka Ratna: 'తాతయ్యా'.. విజయసాయి రెడ్డిని చూడగానే చుట్టిముట్టిన తారక రత్న పిల్లలు.. హార్ట్ టచింగ్‌ వీడియో
Tarakaratna Family
Follow us

|

Updated on: Feb 04, 2024 | 8:34 PM

నందమూరి తారకరత్న ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయి సుమారు ఏడాది కావోస్తోంది. నారా లోకేశ్‌ యువగళం పాద యాత్ర ప్రారంభం రోజున తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సుమారు 23 రోజుల మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. తారక రత్న మరణించి ఏడాది కావొస్తున్నా.. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయన జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇక తారక రత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న అలేఖ్య నిత్యం తారక రత్న జ్ఞాపకాలతోనే జీవితం గడిపేస్తోంది. అప్పుడప్పుడు తారకరత్నతో తనకున్న మధుర జ్ఞాపకాలను సోషల్‌ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసుకుంటోంది. అలా తాజాగా అలేఖ్య షేర్‌ చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఇందులో మొదట పెద్ద కూతురు తారక రత్న చిత్ర పటం వద్ద ఏదో మాట్లాడుతూ కనిపిస్తుంది. ఆయనను స్మరించుకుంది. ఆ తర్వాత డ్యాన్స్‌ కూడా చేసింది. మిగతా ఇద్దరూ పిల్లలు కూడా ఎంతో జాలీగా కనిపించాడు. తల్లి అలేఖ్య తో కలిసి అందరూ సరదాగా గడిపారు. అయితే ఇంతలో వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రత్యక్షం కావడం, ఆయనను చూసిన వెంటనే తారక రత్న పిల్లలు ‘తాతాయ్యా’ అంటూ చుట్టుముడతారు. ఆతర్వాత ప్రేమతో హత్తుకుంటారు. ప్రస్తుతం అలేఖ్య షేర్‌ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అవుతోంది. బాగా ఎమోషనల్‌గా, గుండె బరువెక్కించేలా ఉందంటూ దీనిని చూసిన వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి, విజయసాయిరెడ్డికి మధ్య బంధుత్వం ఉంది. . విజయసాయిరెడ్డి భార్య సోదరి కుమార్తెనే అలేఖ్యారెడ్డి. అంటే వరుసకు విజయసాయిరెడ్డి అలేఖ్యారెడ్డికి పెదనాన్న అవుతారు. అందుకే తారక రత్న చనిపోయిన సమయంలో బాలయ్యతో పాటు అన్నీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారు వైఎస్సార్‌ సీపీ ఎంపీ. తారక రత్న కుటుంబానికి అండగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే తారక రత్న ముగ్గురు పిల్లలతో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడీ వీడియో కూడా అందులోదే. ఎప్పుడు తీసిందో కానీ ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

ఎంపీ విజయ సాయి రెడ్డితో తారక రత్న పిల్లలు.. ఎమోషనల్ వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ