AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paramporul OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్‌ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?

ఓటీటీల్లో సస్పెన్స్‌, క్రైమ్‌, హార్రర్‌, థ్రిల్లర్‌ జానర్‌ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే పలు ఓటీటీ సంస్థలు వివిధ భాషల్లో హిట్‌ అయిన సినిమాలు, సిరీస్‌లను తెలుగులోకి అనువాదం చేసి ఇక్కడి ఆడియెన్స్‌కు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అలా తమిళంలో సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచిన ఒక సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ

Paramporul OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్‌ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?
Paramporul Movie
Basha Shek
|

Updated on: Feb 03, 2024 | 8:37 PM

Share

ఓటీటీల్లో సస్పెన్స్‌, క్రైమ్‌, హార్రర్‌, థ్రిల్లర్‌ జానర్‌ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే పలు ఓటీటీ సంస్థలు వివిధ భాషల్లో హిట్‌ అయిన సినిమాలు, సిరీస్‌లను తెలుగులోకి అనువాదం చేసి ఇక్కడి ఆడియెన్స్‌కు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అలా తమిళంలో సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచిన ఒక సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చింది. తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. అదే ‘పరంపోరుల్‌’. అమితాశ్‌ ప్రధాన్‌, శరత్ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గతేడాది త‌మిళంలో సెప్టెంబ‌ర్ 1న థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఆకట్టుకునే కథా, కథనాలు, గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే ఉండడంతో అక్కడి ప్రేక్షకులను పిచ్చ పిచ్చగా నచ్చేసింది పరంపోరుల్‌. బాక్సాఫీస్‌ వద్ద బాగానే వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ పరంపోరుల్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది ఈటీవీ విన్‌ ఓటీటీ సంస్థ.

అర‌వింద్‌రాజ్ తెరకెక్కించిన పరంపోరుల్‌ సినిమాలో క‌శ్మీరా ప‌ర‌దేశీతో పాటు బాలాజీ శ‌క్తివేల్ కీలక పాత్రల్లో మెరిశారు. యువన్‌ శంకర్‌ రాజా బాణీలు సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. ఆది (అమితాశ్‌ ప్రధాన్‌) నీతి, నిజాయితీగా లైఫ్‌ ను లీడ్‌ చేస్తుంటాడు. అయితే కొన్ని అత్యవసర సరిస్థితుల కారణంగా అతను పురాతన విగ్రహాలు చోరీ చేసే ముఠా సభ్యులతో చేతులు కలుపుతాడు. ప్రముఖ పోలీస్ ఆఫీస‌ర్ మైత్రేయ‌న్‌తో (శ‌ర‌త్‌కుమార్‌) క‌లిసి ప‌నిచేయ‌డానికి అంగీకరిస్తాడు. మరి ఆ ఒప్పందం ఆది జీవితాన్ని ఎలా మార్చేసింది అన్నదే పరంపోరుల్‌ సినిమా కథ. వీకెండ్‌లో మంచి యాక్షన్ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీని చూడాలనుకునే వారికి పరంపోరుల్‌ ఒక మంచి ఛాయిస్‌.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

h3>ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఇతర సినిమాలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్