Chiranjeevi: ‘వారి ఒత్తిడితోనే అన్నయ్యను దూషించా’.. చిరంజీవిని కలిసి క్షమాపణలు చెప్పిన చిన్ని కృష్ణ.. వీడియో
ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. గతంలో కొందరి ఒత్తిడి కారణంగా ఆయనపై దుర్భాషలాడినందుకు ఎంతో బాధగా ఉందని ఈ మేరకు వీడియో విడుదల చేశారు చిన్ని కృష్ణ. అయితే ఎవరి ప్రోద్బలంతో చిరంజీవిని దూషించారో...
ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. గతంలో కొందరి ఒత్తిడి కారణంగా ఆయనపై దుర్భాషలాడినందుకు ఎంతో బాధగా ఉందని ఈ మేరకు వీడియో విడుదల చేశారు చిన్ని కృష్ణ. అయితే ఎవరి ప్రోద్బలంతో చిరంజీవిని దూషించారో మాత్రం చిన్నికృష్ణ చెప్పలేదు. ‘పద్మవిభూషణ్ చిరంజీవిని ఈ రోజు ఆయన నివాసంలో కలిశాను. ఆయన ఎంతో ఆప్యాయంగా నన్ను పలకరించిన తీరుకు పులకించిపోయాను. గతంలో కొంతమంది ప్రోద్భలంతో నా జీవితంలోనే అత్యంత దారుణమైన బ్యాడ్‌టైమ్‌లో అన్నయ్యను నా నోటితో అనరాని మాటలన్నాను. జీవితంలో ఏ మనిషైనా టైమ్ బాగాలేనప్పుడు తెలియకుండానే తప్పులు చేస్తారు. నేను ఆ తప్పు చేశాను. ఈ సందర్భంగా చిరంజీవికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నా. భారతదేశం గర్వించదగ్గ రచయిత చిన్నికృష్ణ అని ఆయన ‘ఇంద్ర’ సినిమా సమయంలో అన్నమాటను గుర్తు చేసుకుంటూ ఆరోజే నా జన్మ ధన్యమైంది అంతటి గొప్ప స్టార్ మెగాస్టార్ నుండి వచ్చిన ప్రశంసతో. నేనే తప్పుగా ఆయనతో మాట్లాడిన రోజు తర్వాత మళ్లీ ఇదే ఆయన్ను కలవడం. అయినప్పటికి ఆయన ప్రేమలో అణువంతైనా మార్పులేదు. ఆ గుణమే శివశంకర వరప్రసాద్‌ను చిరంజీవిని చేసింది. చిరంజీవిని మెగాస్టార్ చేసింది. ఇప్పుడు పద్మవిభూషణున్ని చేసింది’
‘నేను ఆయన పట్ల చేసిన తప్పును భగవంతుని ముందు, నా స్నేహితులముందు, కుటుంబసభ్యులముందు ఎన్నిసార్లు చెప్పుకున్నానో నాకే తెలుసు. అదే విషయాన్ని ఆయన ముందు చెపితే అవన్నీ మరిచిపోయి ఎంతో ఆప్యాయంగా తన స్టైల్లో తాను అక్కున చేర్చుకుని ఏం కథలు రాస్తున్నావు చిన్ని అని ఆప్యాయంగా మాట్లాడారు. ఇంతకంటే ఏం కావాలి ఈ లైఫ్‌కి. మళ్లీ నాకు ఆయనకు ‘ఇంద్ర–2′ లాంటి ప్రాజెక్ట్ సెట్ అవ్వాలని అవుతుందని, త్వరలోనే అలాంటి మంచి వార్త అందరు వింటారని అనుకుంటున్నా. అన్న అన్నయ్య క్షమించు…మీ సోదరుడు చిన్నికృష్ణ’ అంటూ తన ఆవేదనను పంచుకున్నారు చిన్ని కృష్ణ. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
అన్నయ్య ప్రేమలో అణువంతైనా మార్పులేదు..
Writer chinni Krishna apologies to @KChiruTweets garu ❤️
BOSS mimmalni enni matalu anna mee kshaminche gunam ki 🙏🧎🏻#PadmaVibhushanChiranjeevi pic.twitter.com/XkqZCV7olR
— RRReddy (@RamRohitReddy) February 1, 2024
చిరంజీవిని సన్మానిస్తోన్న చిన్నికృష్ణ..
శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా అనే మాటకి నిత్య నిదర్శనం అన్నయ్య♥️
Writer Chinni Krishna Apologies To MEGA STAR ⭐ @KChiruTweets Garu♥️
కలవడానికి వెళ్తే ఎటువంటి కోపం లేకుండా ఆప్యాయంగా పలకరించారు – ఇలాంటి మనిషినా నోటికొచ్చినట్టు వాగిందని క్షమించమన్నా -క్షమించారు అన్నయ్య pic.twitter.com/9SoQdeAXbb
— 𝙺𝙰𝙺𝙸𝙽𝙰𝙳𝙰 𝙼𝙴𝙶𝙰 𝙳𝙴𝚅𝙾𝚃𝙴𝙴 (@Gowtham__JSP) February 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.