Geetha Madhuri: త్వరలో మరోసారి తల్లి కానున్న సింగర్ గీతా మాధురి.. గ్రాండ్‌గా సీమంతం.. ఫొటోస్‌ వైరల్

నందు- గీతా దంపతులకు ఇది వరకే దాక్షాయని అనే కూతురు ఉంది. తాను రెండోసారి గర్భం ధరించినట్లు డిసెంబర్‌లో చెప్పుకొచ్చింది గీత. ఫిబ్రవరిలో దాక్షాయనికి తోడుగా మరో బుజ్జిపాప రానుంది. అంటే ఈ నెలలోనే  గీత పండండి బిడ్డను ప్రసవించనుందన్నమాట.   ప్రస్తుతం నిండు గర్భంతో ఉందామె. ఈ నేపథ్యంలో గీతకు గ్రాండ్‌గా సీమంతం నిర్వహించారు  ఆమె కుటుంబ సభ్యులు.

Geetha Madhuri: త్వరలో మరోసారి తల్లి కానున్న సింగర్ గీతా మాధురి.. గ్రాండ్‌గా  సీమంతం.. ఫొటోస్‌ వైరల్
Geetha Madhuri
Follow us
Basha Shek

|

Updated on: Feb 01, 2024 | 7:28 PM

టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ గీతా మాధురి, నటుడు నందు మరోసారి అమ్మనాన్నాలు కాబోతున్నారు. గీతా మాధురి త్వరలోనే మరోసారి పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో మాతృత్వపు మాధుర్యాన్ని మనసారా ఆస్వాదిస్తోందీ టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌. నందు- గీతా దంపతులకు ఇది వరకే దాక్షాయని అనే కూతురు ఉంది. తాను రెండోసారి గర్భం ధరించినట్లు డిసెంబర్‌లో చెప్పుకొచ్చింది గీత. ఫిబ్రవరిలో దాక్షాయనికి తోడుగా మరో బుజ్జిపాప రానుంది. అంటే ఈ నెలలోనే  గీత పండండి బిడ్డను ప్రసవించనుందన్నమాట.   ప్రస్తుతం నిండు గర్భంతో ఉందామె. ఈ నేపథ్యంలో గీతకు గ్రాండ్‌గా సీమంతం నిర్వహించారు  ఆమె కుటుంబ సభ్యులు. ఈ ఫంక్షన్‌లో గీత స్నేహితులు, సన్నిహితులు కూడా పాల్గొన్నారు.సీమంతం సందదర్భంగా ఆకుపచ్చ – నారింజ రంగు కాంబినేషన్‌లో ఉన్న చీరలో మెరిసిపోయింది. ఇక వేదికను కూడా రకరకాల పూలతో ఎంతో అందంగా అలంకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు గీతా మాధురి దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

గీత, నందులది ప్రేమ వివాహం. 2014లో వీరి వివాహం గ్రాండ్‌ గా జరిగింది. తమ ప్రేమ, అన్యోన్యత బంధానికి గుర్తింపుగానే 2019లో గీతా మాధురి- నందు దంపతులకు దాక్షాయని ప్రకృతి అనే కూతురు పుట్టింది. ఆ మధ్యన గీతు, నందూలు విడిపోతున్నారని వార్తల ఉవచ్చాయి. అయితే ఆ వార్తలను చూసి తాము బాగా నవ్వుకున్నామన్నారీ లవ్లీ కపుల్‌. ఇప్పుడు తమ అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తింపుగా మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నారీ క్యూట్‌ కపుల్‌.  కాగా ఇటీవల నందు నటించిన మ్యాన్షన్‌ 24, వధువు వెబ్‌ సిరీస్‌లకు సూపర్బ్ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ మధ్యన క్రికెట్‌ కామెంటేటర్‌, యాంకర్‌గానూ సరికొత్త అవతారమెత్తాడీ హ్యాండ్సమ్‌ యాక్టర్‌. అలాగే టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

గీతా మాధురి- నందుల పోస్ట్..

గీతా- నందుల లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

గీతా- నందు దంపతుల కూతురు దాక్షాయణి ప్రకృతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సర్జరీ కోసం యూఎస్‌కు శివన్న..ఇంటికి క్యూ కట్టిన హీరోలు, అభిమానులు
సర్జరీ కోసం యూఎస్‌కు శివన్న..ఇంటికి క్యూ కట్టిన హీరోలు, అభిమానులు
శ్రీలీల vs మీనాక్షి చౌదరి.! ఈ ఏడాది వీళ్లే ట్రేండింగ్ ఆ.!
శ్రీలీల vs మీనాక్షి చౌదరి.! ఈ ఏడాది వీళ్లే ట్రేండింగ్ ఆ.!
హీరోయిన్స్‌ను మించి అందాలతో హార్ట్ బీట్ పెంచేస్తున్న బ్యూటీ..
హీరోయిన్స్‌ను మించి అందాలతో హార్ట్ బీట్ పెంచేస్తున్న బ్యూటీ..
ముంబై గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద భారీ ప్రమాదం!
ముంబై గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద భారీ ప్రమాదం!
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
ఐదు రోజుల్లో రూ.1.50 లక్షల ఆదాయం.. ఈ షేర్లు ఉన్న వారికి పండగే..!
ఐదు రోజుల్లో రూ.1.50 లక్షల ఆదాయం.. ఈ షేర్లు ఉన్న వారికి పండగే..!
టాస్క్‌లో కంటెస్టెంట్‌ను కొరికిన హౌస్‌మెట్
టాస్క్‌లో కంటెస్టెంట్‌ను కొరికిన హౌస్‌మెట్
శబరిమలలో మండల పూజ ఎప్పుడు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
శబరిమలలో మండల పూజ ఎప్పుడు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
40 గంటలు చిమ్మ చీకట్లో కొండపై నరకం చూసిన మహిళ!
40 గంటలు చిమ్మ చీకట్లో కొండపై నరకం చూసిన మహిళ!
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..