Ram Charan: రామ్‌ చరణ్‌తో నటించాలనుకుంటున్నారా? RC 16 కోసం ట్యాలెంట్‌ హంట్‌.. పూర్తి వివరాలివే

RC16 ప్రాజెక్ట్‌ కోసం టాలెంట్‌ హంట్‌ నిర్వహించనున్నారు మేకర్స్‌. ఔత్సాహిక నటీనటులకు ఈ పాన్‌ ఇండియా సినిమాలో నటించే సువర్ణావకాశాన్ని అందిస్తున్నారు. ఈ మేరకు RC 16 మూవీ కోసం ఉత్తరాంధ్రలో టాలెంట్ హంట్ నిర్వహించబోతున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది

Ram Charan: రామ్‌ చరణ్‌తో నటించాలనుకుంటున్నారా? RC 16 కోసం ట్యాలెంట్‌ హంట్‌.. పూర్తి వివరాలివే
Ram Charan
Follow us
Basha Shek

|

Updated on: Feb 01, 2024 | 4:39 PM

గేమ్‌ ఛేంజర్ తర్వాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. RC16 (వర్కింగ్ టైటిల్) పేరుతో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కనుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభకానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్స్క్‌ శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే RC16 ప్రాజెక్ట్‌ కోసం టాలెంట్‌ హంట్‌ నిర్వహించనున్నారు మేకర్స్‌. ఔత్సాహిక నటీనటులకు ఈ పాన్‌ ఇండియా సినిమాలో నటించే సువర్ణావకాశాన్ని అందిస్తున్నారు. RC 16 మూవీ కోసం ఉత్తరాంధ్రలో టాలెంట్ హంట్ నిర్వహించబోతున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో విజయనగరం సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో ఆడిషన్స్ జరగబోతున్నట్లు ఇందులో తెలిపారు. ఔత్సాహిక నటీనటులందరూ ఈ సెన్సేషనల్ మూవీలో భాగం కావడానికి సిద్ధంగా ఉండాలని మేకర్స్‌ పిలుపునిచ్చారు. ఏరియాల వారీగా ఆడిషన్స్ జరిగే తేదీలు, వేదికలు, టైమింగ్స్, సంప్రదించవలసిన వ్యక్తుల వివరాలను తెలియజేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీని ప్రకారం పురుషులు, స్త్రీలతో పాటు ఛైల్డ్‌ ఆర్టిస్టులు కూడా ఈ ట్యాలెంట్‌ హంట్‌లో పాల్గొనవచ్చు.

RC 16 ట్యాలెంట్‌ హంట్‌ షెడ్యూల్‌ ఇదే..

విజయనగరం (ఫిబ్రవరి-5,6,7) వెన్యూ- హోటల్‌ వీఆర్‌ గ్రాండ్‌ రైల్వే స్టేషన్‌ రోడ్‌ సీఎంఆర్‌ మాల్‌ పక్కన విజయనగరం

సాలూరు (ఫిబ్రవరి-8,9,10) ఘనా సాయి గెస్ట్‌ ఇన్‌ యాక్సిస్‌ బ్యాంక్‌పైన, మెయిన్‌ రోడ్‌, సాలూరు.

శ్రీకాకుళం (ఫిబ్రవరి-11,12,13) వేదిక: నాగవల్లి హోట్‌ రింగ్‌ రోడ్‌, మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్స్‌, శ్రీకాకుళం

విశాఖపట్నం (ఫిబ్రవరి-15,16,17) వేదిక: శౌర్య ఇన్‌ శ్రీకన్య థియేటర్‌ లైన్‌, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం

ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్‌ జరుగుతాయి. సుమారు 400 మంది నటీనటులను ఈ ట్యాలెంట్‌ హంట్‌ ద్వారా ఎంపికచేయనున్నారు మేకర్స్‌. ఉత్తరాంధ్రలో జరిగే సినిమా కాబట్టి. ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో అనర్గళంగా డైలాగ్స్ చెప్పగల నటీనటులు అవసరం అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌తో లార్జ్ స్కేల్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈసినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

సుమారు 400 మంది నటీనటుల ఎంపిక కోసం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.