Brahmanandam: తెలుగు నేపాలీ సినిమాలో హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం మూవీకి డిఫరెంట్ టైటిల్..

ఈరోజు బ్రహ్మానందం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. అలాగే బ్రహ్మానందం కొత్త సినిమాలను కూడా ప్రకటించారు. ఇప్పటికే ఎన్నో భాషల్లో నటించిన ఆయన.. ఇప్పుడు నేపాలీ భాషలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటిస్తోన్న మొదటి తెలుగు, నేపాలీ సినిమాను అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలాగే 'హ్రశ్వ దీర్ఘ' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలిపారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు.

Brahmanandam: తెలుగు నేపాలీ సినిమాలో హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం మూవీకి డిఫరెంట్ టైటిల్..
Brahmanandam
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 01, 2024 | 6:25 PM

తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ కింగ్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. ఎన్నో సంవత్సరాలుగా దాదాపు వెయ్యికి పైగా సినిమాల్లో నటించి తనదైన కామెడీ టైమింగ్.. నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు బహ్ర్మీ. కమెడియన్ మాత్రమే కాదు.. సోషల్ మీడియా మీమ్ గాడ్ కూడా ఆయనే. ఎంతటి సీరియస్ పరిస్థితి అయినా.. కన్నీరు తెప్పించే బాధలో ఉన్నా.. బ్రహ్మీ ఫోటో కనిపిస్తే చాలు పెదాలపైకి చిరునవ్వు రావాల్సిందే. అందుకే ఆయనను హాస్యబ్రహ్మా అని పిలుచుకుంటారు. ఈరోజు బ్రహ్మానందం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. అలాగే బ్రహ్మానందం కొత్త సినిమాలను కూడా ప్రకటించారు. ఇప్పటికే ఎన్నో భాషల్లో నటించిన ఆయన.. ఇప్పుడు నేపాలీ భాషలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటిస్తోన్న మొదటి తెలుగు, నేపాలీ సినిమాను అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలాగే ‘హ్రశ్వ దీర్ఘ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలిపారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాలో హరిహర అధికరి, నీతా దుంగన ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన బ్రహ్మానందం.. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. ఆయన నటిస్తోన్న ఓటీటీ ఏంట్రీ మూవీకి ‘VVY’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వీవీవై అంటే ఏమిటన్నది మాత్రం రివీల్ చేయలేదు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఈటీవీ విన్ లో జూలై 18న స్ట్రీమింగ్ చేయనున్నారు. రోడ్ జర్నీ బ్యాక్ డ్రామ్ లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టైటిల్ పోస్టర్ లో ఎల్లో కలర్ వ్యాన్ ను చూపించారు.

మోస్ట్ ఎంటర్టైనింగ్ ట్రిప్ ఆఫ్ ది ఇయర్ అంటూ పోస్టర్ పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పెంచుతుంది. పోస్టర్, టైటిల్ తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమాలో సీనియర్ నరేష్, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనురాగ్ పాలుట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.