Aishwarya Rajesh: డైరెక్టర్ ఓవర్ యాక్షన్.! బుద్ది చెప్పిన తెలుగు హీరోయిన్ ఐశ్యర్వ రాజేష్
ఐశ్యర్వ రాజేష్! తెలుగమ్మాయి. తన యాక్టింగ్ ట్యాలెంట్‌తో.. తమిళ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న అమ్మాయి. అలాంటి ఈ అమ్మాయిపై తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు కోలీవుడ్ యంగ్ డైరెక్టర్. అయితే ఈ కామెంట్సే ఇప్పుడు ఈ హీరోయిన్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించేలా చేస్తున్నాయి. ఓ పక్క తమ అభిమాన హీరోయిన్ పద్దతిగా ఉన్నా... మధ్యలో మీ ఓవర్ యాక్షన్ ఏంటనే కామెంట్.. ఆ డైరెక్టర్కు వ్యతిరేకంగా వచ్చేలా చేస్తోంది.
ఐశ్యర్వ రాజేష్! తెలుగమ్మాయి. తన యాక్టింగ్ ట్యాలెంట్‌తో.. తమిళ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న అమ్మాయి. అలాంటి ఈ అమ్మాయిపై తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు కోలీవుడ్ యంగ్ డైరెక్టర్. అయితే ఈ కామెంట్సే ఇప్పుడు ఈ హీరోయిన్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించేలా చేస్తున్నాయి. ఓ పక్క తమ అభిమాన హీరోయిన్ పద్దతిగా ఉన్నా… మధ్యలో మీ ఓవర్ యాక్షన్ ఏంటనే కామెంట్.. ఆ డైరెక్టర్కు వ్యతిరేకంగా వచ్చేలా చేస్తోంది. ఇంతకీ ఆ దర్శకుడు.. ఏం అన్నారంటే.. “నేను డైరెక్ట్ చేసిన సినిమాతోనే ఐశ్వర్య రాజేశ్ పరిచయం అయ్యింది.. ఆ విషయం ఆమె ఎక్కడా కూడా చెప్పలేదు. ఇప్పుడు స్టార్ డమ్ రావడంతో నాతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.. ఒకప్పుడు ఆమెకు ఆటోకు కూడా డబ్బులు లేకపోతే నేనే ఇచ్చాను” అని ఓ ఇంటర్వ్యూలో ఐశ్యర్వపై కామెంట్స్ చేశారు ఆ డైరెక్టర్. ఇక డైరెక్టర్ మాటలు కాస్త నెట్టింట వైరల్ అవ్వడంతో.. రంగంలోకి దిగిన ఐశ్యర్వ రాజేష్.. ఆ డైరెక్టర్ పేరు కానీ.. ఆయన కామెంట్స్ కానీ మెన్షన్ చేయకుండా… ఓ ట్వీట్ చేశారు. చాలా మంది ఒక వైపే విని మాట్లాడుతుంటారని.. అసలు విషయాలు తెలుసుకోకుండా.. ఓ నిర్ణయానికి వచ్చి జీవితంలోని అనుబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేసుకుంటున్నారని.. ఎవరైనా సరే.. పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందంటూ.. తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఈ ట్వీట్‌ను పట్టుకున్న ఐశ్యర్వ ఫ్యాన్స్.. డైరెక్టర్ తీరును ట్రోల్ చేస్తున్నారు. ఆ డైరెక్టర్‌ను విమర్శిస్తున్నారు. తన ట్వీట్‌తో..ఆ డైరెక్టర్‌కు ఐశ్యర్య బుద్ది చెప్పిందని అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos