Allu Arjun – Pushpa 2: పుష్ప టీంకు కొత్త తలనొప్పి.! ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం నిల్.
చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా ఈ లీకులతో పెద్ద చిక్కొచ్చి పడింది దర్శక నిర్మాతలకు. సినిమా మొదలెట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ఎదో ఒక ఫోటో, వీడియో లీక్ అవుతూనే ఉంటుంది. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసిన కూడా ఈ లీక్ లను ఆపలేకపోతున్నారు చిత్రయూనిట్. ఇప్పుడు పుష్ప 2 సినిమాకు కూడా అదే తలనొప్పి మొదలైంది. సెట్ నుంచి అల్లు అర్జున్‌కు సంబంధించిన మరో పిక్ లీకైంది.
చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా ఈ లీకులతో పెద్ద చిక్కొచ్చి పడింది దర్శక నిర్మాతలకు. సినిమా మొదలెట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ఎదో ఒక ఫోటో, వీడియో లీక్ అవుతూనే ఉంటుంది. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసిన కూడా ఈ లీక్ లను ఆపలేకపోతున్నారు చిత్రయూనిట్. ఇప్పుడు పుష్ప 2 సినిమాకు కూడా అదే తలనొప్పి మొదలైంది. సెట్ నుంచి అల్లు అర్జున్‌కు సంబంధించిన మరో పిక్ లీకైంది. ఇక అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అవవడమే కాదు ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూట్‌తో తెగ బిజీగా ఉన్నారు బన్నీ. పుష్ప మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. డైరెక్టర్ సుకుమార్.. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. దానికితోడు ఈ మూవీ నుంచి రీసెంట్‌గా రిలీజ్ అయిన పుష్ప2 గంగమ్మ జాతర పోస్టర్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది.
అల్లు అర్జున్ గంగమ్మ తల్లి వేశంలో కనిపించడం.. అందర్నీ గూస్ బంప్స్ పుట్టించింది. అయితే ఈ గెటప్‌కు సంబంధించిన షూట్ రీసెంట్‌గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ గెటప్‌కు సంబంధించిన బన్నీ ఫోటోలు నెట్టింట లీక్ అయ్యాయి. విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ‘పుష్ప 2’ సెట్స్ నుంచి లీక్స్ జరగకుండా.. ఈ మూవీ యూనిట్ అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. బన్నీ గంగమ్మ గెటప్‌లో ఉన్న పిక్ లీక్ అవ్వడం మేకర్స్‌ను పరేషాన్ చేస్తోంది. ఫోటో లీక్ చేసిన వారిని కనిపెట్టి.. చట్టరిత్యా చర్చలు తీసుకునే పనిలో ఉందని తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
