Kumari Aunty: కుమారీ ఆంటీపై కేసు నమోదు.. స్ట్రీట్‌ ఫుడ్‌ బిజినెస్‌ క్లోజ్‌.. కారణమేంటో తెలుసా?

కుమారీ ఆంటీ.. ఇటీవల సోషల్‌ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేరు. హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జి పరిసరాల్లో స్ట్రీట్‌ ఫుడ్‌ చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమె ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ వీడియోలతో బాగా ఫేమస్ అయిపోయింది. యూట్యూబ్‌ ఛానెల్స్ అయితే ఆమెతో ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టాయి.

Kumari Aunty: కుమారీ ఆంటీపై కేసు నమోదు.. స్ట్రీట్‌ ఫుడ్‌ బిజినెస్‌ క్లోజ్‌.. కారణమేంటో తెలుసా?
Kumari Aunty
Follow us
Basha Shek

|

Updated on: Jan 30, 2024 | 9:31 PM

కుమారీ ఆంటీ.. ఇటీవల సోషల్‌ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేరు. హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జి పరిసరాల్లో స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమె ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ వీడియోలతో బాగా ఫేమస్ అయిపోయింది. యూట్యూబ్‌ ఛానెల్స్ అయితే ఆమెతో ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టాయి. కుమారీ ఆంటీకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె బిజినెస్‌ ఇన్ని లక్షలు జరుగుతుందని, సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్‌ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం సాగింది. అంతేకాదు బిగ్‌బాస్‌ రాబోయే సీజన్‌లోనూ కుమారి ఆంటీ కనిపిస్తారంటూ కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌ కథనాలు అల్లేశాయి. ఇలా మొత్తానికి సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది కుమారి ఆంటీ. యువకులంతా ఆమె దగ్గరే భోజనం చేసుందుకు ఎగబడుతున్నారు. అయితే ఈ పాపులారిటీ, క్రేజ్‌నే కుమారీ ఆంటీని కష్టాల్లోకి నెట్టేసింది. కుమారి ఆంటీ దగ్గరే భోజనం చేసేందుకు ఎగబడడంతో రద్దీ ఎక్కువైపోతంది. ఇక్కడకు వచ్చిన వారు రోడ్డు పైనే వాహనాలు పార్క్‌ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ఫుల్‌ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఇలా రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని కుమారి ఆంటీకి తేల్చిచెప్పేశారు. దీంతో ఆమెకు, ట్రాఫిక్‌ పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం నడిచింది.

నాకు న్యాయం చేయాలి..

కాగా తన స్ట్రీట్‌ ఫుడ్‌ బిజినెస్‌ క్లోజ్‌ చేయించడంతో కుమారీ ఆంటీ ఎమోషనల్‌ అయ్యారు. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘మీడియా వాళ్లే నాకు ఇంత పేరొచ్చింది. ఇప్పుడు కూడా మీడియానే నాకు న్యాయం చేయాలి. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించొద్దంటూ నా దగ్గరకు భోజనం చేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ చెబుతున్నాను. నాతో పాటు ఇక్కడ చాలామంది స్ట్రీట్‌ ఫుడ్‌ బిజినెస్‌ రన్‌ చేస్తున్నారు. కానీ పోలీసులు నా స్టాల్‌ను మాత్రమే క్లోజ్‌ చేయాలని చెబుతున్నారు’ అని ఎమోషనల్‌ అయ్యారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది వ్యూస్‌ కోసం కుమారి ఆంటీ బిజినెస్‌ను రోడ్డు మీదుకు లాగారని, ఇప్పుడా పాపులారిటీనే ఆమెకు, ఆమె బిజినెస్‌కు శాపంగా మారిందని తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కుమారీ ఆంటీ బిజినెస్ స్టాల్..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..