- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun Rs7 crore Vanity Van special feaures, Watch photos
Allu Arjun: ‘చక్రాలపై నడిచే స్వర్గధామం’.. అల్లు అర్జున్ వ్యానిటీ వ్యాన్ స్పెషల్ ఫీచర్స్ ఏంటో తెలుసా?
సినిమాల సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్‌కు ఆటో మొబైల్స్ పై ఎనలేని ఆసక్తి. బన్నీ గ్యారేజ్‌ను ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. BMW X5, జాగ్వార్ XJL లాంటి సూపర్ మోడల్ లగ్జరీ కార్లు అల్లు అర్జున్ గ్యారేజ్ లో ఉన్నాయి.
Updated on: Jan 29, 2024 | 10:30 PM

సినిమాల సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్‌కు ఆటో మొబైల్స్ పై ఎనలేని ఆసక్తి. బన్నీ గ్యారేజ్‌ను ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. BMW X5, జాగ్వార్ XJL లాంటి సూపర్ మోడల్ లగ్జరీ కార్లు అల్లు అర్జున్ గ్యారేజ్ లో ఉన్నాయి.

ఇవన్నీ ఒక ఎత్తయితే అల్లు అర్జున్ వ్యానిటీ వ్యాన్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మరీ సింపుల్‌గా చెప్పాలంటే చక్రాల మీద ఉండే ఒక స్వర్గధామం. అత్యంత విలాసవంతంగా ఉండే ఈ వ్యానిటీ వ్యాన్ ధరెంతో తెలుసా అక్షరాలా రూ. 7 కోట్లు

సాధారణంగా అల్లు అర్జున్‌కు బ్లాక్ కలర్ ఇష్టమని అతని గురించి తెలిసిన వారు చెబుతుంటారు. అందుకే ఈ వ్యానిటీ వ్యాన్ కారును పూర్తిగా బ్లాక్‌లో ఉండేలా స్పెషల్‌గా డిజైన్ చేపించాడు బన్నీ.

ఇక వ్యానిటీ వ్యాన్ లోపం అధునాతన ఫీచర్లు ఉన్నాయి. లివింగ్ ఏరియా, ప్రీమియమ్ లాంజ్, విశాలమైన బెడ్ రూమ్, స్పెషల్‌గా మేకప్ రూమ్.. భారీ టీవీ సెట్, ఫ్రిజ్.. ఇలా అన్ని ఆధునిక హంగులతో తన వ్యాన్‌ను డిజైన్ చేయించుకున్నాడు బన్నీ.

అప్పుడప్పుడూ తన వ్యానిటీ వ్యాన్‌కు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటాడు అల్లు అర్జున్. ఫాల్కన్ ( వ్యానిటీ వ్యాన్) తనకెంతో స్పెషల్ అందరితో పంచుకుంటుంటాడు.