- Telugu News Photo Gallery Cinema photos Bollywood hero Bobby Deol has been roped in as the villain in NBK 109
Balakrishna: బాలయ్య కోసం విలన్‌గా మారిన బాలీవుడ్ హీరో.. ఎవర్ని విలన్‌గా తీసుకొస్తున్నారు..?
బాలయ్య కోసం మరో బాలీవుడ్ హీరో కూడా విలన్‌గా మారిపోయారు. ఈ మధ్య NBK సినిమా అంటే చాలు.. ప్రతినాయకులు బలంగా కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా సీనియర్ హీరోలనే బాలయ్యకు ఆపోజిట్‌గా తీసుకుంటూ మరింత ఆసక్తి పెంచేస్తున్నారు దర్శకులు. తాజాగా బాబీ కూడా ఇదే చేసారు. మరి బాలయ్య కోసం ఈయన ఎవర్ని విలన్‌గా తీసుకొస్తున్నారు..?
Updated on: Jan 29, 2024 | 10:05 PM

బాలయ్య కోసం మరో బాలీవుడ్ హీరో కూడా విలన్‌గా మారిపోయారు. ఈ మధ్య NBK సినిమా అంటే చాలు.. ప్రతినాయకులు బలంగా కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా సీనియర్ హీరోలనే బాలయ్యకు ఆపోజిట్‌గా తీసుకుంటూ మరింత ఆసక్తి పెంచేస్తున్నారు దర్శకులు. తాజాగా బాబీ కూడా ఇదే చేసారు. మరి బాలయ్య కోసం ఈయన ఎవర్ని విలన్‌గా తీసుకొస్తున్నారు..?

ఒకప్పుడు తన సినిమా కాస్టింగ్ విషయంలో బాలయ్య అంత పక్కాగా ఉండేవారు కాదు కానీ ఇప్పుడలా కాదండోయ్..! తనతో పాటు ఎవరు నటిస్తున్నారు.. స్టార్స్ ఉన్నారా లేదా.. తన రేంజా కాదా అనేది చూసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బాలయ్య కోసం హీరోలే విలన్లుగా మారిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో బాబీ డియోల్ NBK 109లో విలన్‌గా ఎంపికయ్యారు.

ఇండియన్ సినిమాలో ఈ మధ్య బాబీ డియోల్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. దానికి కారణం యానిమల్ సినిమా.. అందులో ఆయన నటన. మాటల్లేకుండా కేవలం తన నటనతోనే ఇచ్చిపడేసారు బాబీ డియోల్. అలాగే సూర్య కంగువాలోనూ బాబీనే విలన్. దాంతో పాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులోనూ ఈయనే ప్రతినాయకుడు.

ఇక బాలయ్య విషయానికొస్తే.. కొన్నేళ్లుగా ఈయన సినిమాల్లో సీనియర్ హీరోలే విలన్లుగా మారుతున్నారు. లెజెండ్‌లో జగపతిబాబు నుంచి ఇది మొదలైంది. ఆ తర్వాత అఖండలో శ్రీకాంత్.. వీరసింహారెడ్డిలో దునియా విజయ్..

మొన్న భగవంత్ కేసరిలో అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా మెప్పించారు. ఇప్పుడు బాబీ సినిమాలో బాబీ డియోల్ నటిస్తున్నారు. మరి ఈయన విలనిజం ఎలా ఉండబోతుందో చూడాలిక.