AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Suma: ‘సుమక్కా.. నీ మంచి మనసుకు హ్యాట్సాఫ్’.. బిగ్‌బాస్‌ సొహైల్‌కు స్టార్ యాంకర్ ఎలాంటి సాయం చేసిందంటే?

సినిమాల సంగతి పక్కన పెడితే.. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది సుమ కనకాల. ' ఫెస్టివల్ ఫర్ జాయ్' స్వచ్ఛంద సంస్థ పేరు మీదుగా మహిళలు, పిల్లలకు అవసరమైన సహాయ కార్యక్రమాలను చేపడుతోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఫేమ్‌, యంగ్‌ హీరో సయ్యద్‌ సోహైల్‌ ఇటీవల యాంకర్‌ సుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Anchor Suma: 'సుమక్కా.. నీ మంచి మనసుకు హ్యాట్సాఫ్'.. బిగ్‌బాస్‌ సొహైల్‌కు స్టార్ యాంకర్ ఎలాంటి సాయం చేసిందంటే?
Syed Sohel, Anchor Suma
Basha Shek
|

Updated on: Jan 29, 2024 | 8:44 PM

Share

సుమ కనకాల.. తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం అవసరం లేని పేరు. వేదిక ఏదైనా, సందర్భమేదైనా తమ మాటల ప్రవాహంతో ఆహూతులను ఎంటర్‌టైన్‌ చేయడం ఈ స్టార్‌ యాంకరమ్మ స్పెషాలిటీ. అందుకే సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్‌ మీట్లు.. ఇలా సినిమాలకు సంబంధించి ఏ కార్యక్రమమైనా సుమక్క ఉండాల్సిందే. సినిమాల సంగతి పక్కన పెడితే.. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది సుమ కనకాల. ‘ ఫెస్టివల్ ఫర్ జాయ్’ స్వచ్ఛంద సంస్థ పేరు మీదుగా మహిళలు, పిల్లలకు అవసరమైన సహాయ కార్యక్రమాలను చేపడుతోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఫేమ్‌, యంగ్‌ హీరో సయ్యద్‌ సోహైల్‌ ఇటీవల యాంకర్‌ సుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన లేటెస్ట్‌ సినిమా ‘బూట్‌ కట్‌ బాలరాజు’ ప్రమోషన్ల విషయంలో సుమక్క అందించిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఎమోషనల్‌ అయ్యాడు.

‘ నా సినిమా బూట్‌ కట్‌ బాలరాజు’ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేశాం. అందులో యాంకర్‌గా సుమ ఉంటే బాగుంటుందని అనుకున్నాం. ఇందుకోసం ఆమెతో మాట్లాడాలని మేనేజర్‌కు కాల్‌ చేశాను. అయితే నా సినిమా ఈవెంట్‌ కోసం ఎక్కువ డబ్బులు ఇవ్వలేను అని కొంచెం తగ్గించాలని కోరాను. దీంతో సుమ గారితో మాట్లాడి చెబుతాన్నాడు మేనేజర్‌. కానీ కొంత సమయం తర్వాత సుమక్క నుంచి నాకు కాల్‌ వచ్చింది. అక్కా.. మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నేను తక్కువ డబ్బులిద్దా మనుకుంటున్నాను. ఈ సినిమాకు నేనే నిర్మాత. నా దగ్గర అంత డబ్బు లేదు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాను అని చెప్పాను. నా పరిస్థితిని సుమక్క అర్థం చేసుకుంది. వెంటనే ‘నీ దగ్గర డబ్బులేమీ తీసుకోను.. ఉచితంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ చేస్తాను. జీవితంలో ఇంత ఎదిగిన తర్వాత కూడా మీలాంటి వాళ్లకు సాయం చేయలేకపోతే నేనేందుకు అని సుమక్క చెప్పారు. బూట్‌ కట్‌ బాలరాజు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొంటానని సుమక్క చెప్పింది ‘ అంటూ సోహైల్‌ ఎమోషనల్‌ అయ్యాడు. ప్రస్తుతం సోహైల్‌ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. సుమక్క మంచి మనసును అభిమానులు, నెటిజన్లు కొనియాడుతున్నారు.

ఇవి కూడా చదవండి

బూట్‌ కట్‌ బాలరాజు లో బిగ్ బాస్ సోహైల్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి