Kadambari Kiran: ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడిలా కాదంబరి కిరణ్‌.. మరోసారి సినీ కార్మికులకు భారీ ఆర్థిక సాయం

కమెడియన్‌గా వందలాది సినిమాల్లో నటించి మెప్పించారు కాదంబరి కిరణ్‌. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారాయన. కానీ  గతంలోలాగా ఇప్పుడు కిరణ్‌ సినిమాలు చేయట్లేదు. అయితేనేం తన మంచి పనులు, సేవా కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారీ సీనియర్‌ యాక్టర్‌.

Kadambari Kiran: ఆపదలో ఉన్నవారికి  ఆపద్బాంధవుడిలా కాదంబరి కిరణ్‌..  మరోసారి సినీ కార్మికులకు భారీ ఆర్థిక సాయం
Kadambari Kiran
Follow us
Basha Shek

|

Updated on: Jan 28, 2024 | 12:54 PM

కమెడియన్‌గా వందలాది సినిమాల్లో నటించి మెప్పించారు కాదంబరి కిరణ్‌. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారాయన. కానీ  గతంలోలాగా ఇప్పుడు కిరణ్‌ సినిమాలు చేయట్లేదు. అయితేనేం తన మంచి పనులు, సేవా కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారీ సీనియర్‌ యాక్టర్‌. తన మనం సైతం ఫౌండేషన్‌ ద్వారా సినీ పరిశ్రమలోని పేద కార్మికులకు అవసరమైతే బయటివారికి కూడా సహాయం చేస్తున్నారు. గత పదేళ్లుగా ఈ ఫౌండేషన్‌ను నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాదంబరి కిరణ్‌. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారాయన. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్‌, సీనియర్‌ నటి రంగస్థలం లక్ష్మి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాదంబరి కిరణ్‌ రూ.25,000 ఆర్థిక సాయం అందించారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన సూరే పల్లి బాలిక ఉన్నత చదువుల కోసం మరో రూ.25,000లు అందజేశారు. అలాగే ఎనుముల విదిష అనే బాలిక‌కు ముక్కుకు సంబంధించిన ఆప‌రేష‌న్ కోసం 25,000 ఇచ్చారు.

అంతకు ముందు ప్రముఖ సీనియర్‌ నటి పావలా శ్యామలకు కూడా రూ.25వేల చెక్కును అందజేశారు కాదంబరి కిరణ్‌. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న శ్యామలను వెతుక్కుంటూ వెళ్లి మరీ ఆర్థిక సాయం అందజేశారాయన. అలాగే ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు వీర భద్రయ్యకు కూడా ఆపన్న హస్తం అందించారు. ఆయన వైద్య ఖర్చుల కోసం గుంటూరు వెళ్లి మరీ తన కుటుంబ సభ్యులకు రూ. 25 వేల చెక్కును అందజేశారు. మొత్తానికి తన మంచి పనులు, సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలు అందుకుంటున్నారు కాదంబరి కిరణ్‌. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది విశ్వక్‌ సేన్‌ ధమ్కీ, లవ్యూ రామ్‌ వంటి సినిమాల్లో మాత్రమే కనిపించారు కిరణ్‌. ప్రస్తుతం రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పావలా శ్యామలను వెతుక్కుంటూ వెళ్లి మరీ..

సినీ కార్మికులకు సాయం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి