Watch: విందుకు ప్రధాని మోదీని ఆహ్వానించి ఆశ్చర్యపరిచిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు!
ఇజ్రాయెల్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో మోదీ పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మోదీకి ఘనంగా సన్మానం జరిగింది. ఇక, రెండు దేశాల మధ్య 10 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలు జరిగాయి.

ఇజ్రాయెల్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో మోదీ పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మోదీకి ఘనంగా సన్మానం జరిగింది. ఇక, రెండు దేశాల మధ్య 10 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ.. ప్రధాని మోదీకి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. బుధవారం (ఫిబ్రవరి 25) ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విందుకు ముందు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రత్యేకించి భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించిన నెతన్యాహు.. మోదీతో విందులో పాల్గొన్నారు. బెంజమిన్ నెతన్యాహు భారతీయ, పాశ్చాత్య దుస్తులను కలిపి ధరించి కనిపించారు.
బెంజమిన్ నెతన్యాహు తెల్లటి ఫుల్ స్లీవ్స్ షర్ట్ మీద లేత బూడిద రంగు స్లీవ్ లెస్ జాకెట్ ధరించారు. ఇది సాంప్రదాయ భారతీయ జాకెట్‌ను గుర్తుకు తెస్తుంది. అతను ముదురు రంగు ఫార్మల్ ప్యాంటు, నల్లటి ఫార్మల్ షూలతో జత చేశారు. ఈ మేరకు నెతన్యాహు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “మా ఉమ్మడి విందుకు ముందు, నేను సాంప్రదాయ భారతీయ దుస్తులు ధరించి నా స్నేహితుడు ప్రధాన మంత్రి మోదీని ఆశ్చర్యపరిచాను” అని రాశారు.
हमारे संयुक्त रात्रिभोज से पहले, मैंने अपने मित्र प्रधानमंत्री मोदी को पारंपरिक भारतीय परिधान पहनकर चौंका दिया। 🇮🇱🇮🇳@narendramodi pic.twitter.com/3ElIQeLY97
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) February 25, 2026
అంతకు ముందు జెరూసలేంలో జరిగిన నెస్సెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్) ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగించారు. దీంతో, ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానమంత్రిగా ప్రధాని మోదీ చరిత్ర సృష్టించారు. నెస్సెట్‌కు చేరుకున్న స్పీకర్ అమీర్ ఒహానా ప్రధానమంత్రిని స్వాగతించి, ఆయనకు ఆచారబద్ధమైన స్వాగతం పలికారు. ప్రత్యేక గౌరవం ఇచ్చినందుకు స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్’ పతకాన్ని అందుకున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పతకాన్ని రెండు దేశాల శాశ్వత స్నేహం, ఉమ్మడి ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అంకితం చేశారు.
భారతదేశం – ఇజ్రాయెల్ మధ్య పురాతన నాగరికత సంబంధాల గురించి, అలాగే సాంకేతికత, ఆవిష్కరణ, రక్షణ, భద్రత, వ్యూహాత్మక కలయికపై ఆధారపడిన బలమైన ఆధునిక భాగస్వామ్యం గురించి ప్రధాని మోదీ విస్తృతంగా మాట్లాడారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నీటి నిర్వహణ, స్థిరత్వం వంటి రంగాలలో సహకారం రెండు దేశాల మధ్య సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదంపై ఇరు దేశాలు అనుసరించే అచంచలమైన జీరో-టాలరెన్స్ విధానాన్ని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి క్రూరత్వం, అనాగరికతను ఏ రూపంలోనూ సమర్థించలేమని ఆయన నిస్సందేహంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారించే అన్ని ప్రయత్నాలకు భారతదేశం పూర్తి మద్దతు ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
