AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా కాదు.. ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఉన్న దేశం ఇదే! తలసరి సంపద రూ.8.75 కోట్లు!

Richest Countries In The World: అమెరికానే ప్రపంచంలో అత్యంత సంపన్నులున్న దేశమని అనుకుంటున్నారా? తాజాగా వెల్లడైన అధ్యయనం ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది. తలసరి సగటు సంపదలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలవగా.. అమెరికా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఏయే దేశాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికా కాదు.. ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఉన్న దేశం ఇదే! తలసరి సంపద రూ.8.75 కోట్లు!
Worlds Richest Country
Rajashekher G
|

Updated on: Aug 10, 2026 | 10:15 AM

Share

Rich Country in the World in Telugu: ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఉన్న దేశం అనగానే సాధారణంగా అమెరికా పేరు గుర్తుకొస్తుంది. అయితే, తాజాగా వెలువడిన ఒక అధ్యయనం మాత్రం ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. అత్యంత సంపన్న జనాభా ఉన్న దేశాల జాబితాలో అమెరికాను వెనక్కి నెట్టి స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది.

స్విట్జర్లాండ్‌దే అగ్రస్థానం

అధ్యయనం ప్రకారం.. స్విట్జర్లాండ్‌లో తలసరి సగటు సంపద సుమారు 9.10 లక్షల అమెరికన్ డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.8.75 కోట్లు. దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్, భీమా, పర్యాటకం వంటి రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. స్విట్జర్లాండ్ కేవలం ఆర్థిక రంగానికే కాకుండా ఔషధాలు, విలాసవంతమైన గడియారాలు, చాక్లెట్ల తయారీలోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. బలమైన ఆర్థిక వ్యవస్థ, అధిక ఆదాయ స్థాయులు, ఆర్థిక సేవల రంగం దేశ సంపదకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

అమెరికా రెండో స్థానంలో..

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. అక్కడ తలసరి సగటు సంపద సుమారు 6.69 లక్షల అమెరికన్ డాలర్లుగా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ మొత్తం ఆర్థిక ఉత్పత్తిలో అమెరికా వాటా సుమారు 26 శాతంగా ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

టాప్‌-7 దేశాల జాబితా ఇదే

అత్యంత సంపన్నులున్న దేశాల జాబితాలో స్విట్జర్లాండ్, అమెరికా తర్వాత లక్సెంబర్గ్ మూడో స్థానంలో నిలిచింది. హాంగ్‌కాంగ్ నాలుగో స్థానంలో, ఆస్ట్రేలియా ఐదో స్థానంలో ఉన్నాయి. ఆసియాలోని ప్రముఖ ఆర్థిక కేంద్రం సింగపూర్ ఆరో స్థానంలో ఉండగా, డెన్మార్క్ ఏడో స్థానాన్ని దక్కించుకుంది.

ఈ గణాంకాలు చూస్తే ప్రపంచంలో అత్యంత సంపన్నులు కేవలం పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాల్లోనే కాకుండా.. అధిక తలసరి సంపద, బలమైన ఆర్థిక సేవలు, పెట్టుబడులు, అధిక విలువ కలిగిన పరిశ్రమలు ఉన్న చిన్న దేశాల్లోనూ ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Follow Us