AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic OTT: డివైడ్ టాక్ దెబ్బకు డీల్ సెట్..! ఓటీటీలోకి టాక్సిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే

డ్యాడీ ఈజ్ హోమ్.. అంటూ టాక్సిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ అంటూ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Toxic OTT: డివైడ్ టాక్ దెబ్బకు డీల్ సెట్..! ఓటీటీలోకి టాక్సిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే
Toxic Movie
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2026 | 8:18 AM

Share

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ సినిమా టాక్సిక్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ సినిమా ఊహించని విధంగా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాలు, బీభత్సంమైన ప్రమోషన్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. దాంతో ఆడియన్స్ ఈ సినిమాపై బోలెడన్ని హోప్స్ పెట్టుకున్నారు. తీరా థియేటర్స్ కు వెళ్లిన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. సినిమా చూసిన ఆడియన్స్ చాలా మంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు. టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ సినిమా ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కన్నడ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. సినిమా టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది.

తొలి రోజు టాక్సిక్ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు ఇండియాలో ఈ సినిమా ఏకంగా రూ.101.10 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా విడుదలకు ముందు కూడా భారీగా బిజినెస్ చేసింది. అయితే రెండో రోజుకు సీన్ మారిపోయింది. కలెక్షన్ దారుణంగా డ్రాప్ అయ్యాయి. ఇండియాలో టాక్సిక్ సినిమా రెండో రోజు కేవలం రూ.37.65 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసింది. మొదటి రోజుతో పోల్చుకుంటే ఏకంగా రూ. 62.8 శాతం భారీ డ్రాప్ అయ్యాయి.

దాంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అన్న ఆసక్తికర టాక్ మొదలైంది. సినిమాకేజు మిక్స్డ్ టాక్ రావడంతో సినిమా ఓటీటీ విడుదల కోసం అందరు ఎదురుచూస్తున్నారు. కాగా టాక్సిక్ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుందని తెలుస్తుంది. రూ. 230కోట్లకు జీ5 టాక్సిక్ సినిమా రైట్స్ సొంతం చేసుకుందని అంటున్నారు. అలాగే ఈ సినిమాను దసరా కానుకగా ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. 2026 అక్టోబర్ చివరిలో సినిమా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us