AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా దెబ్బకు మొత్తం పోగొట్టుకున్నాం.. చివరకు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు రఘుబాబు తనదైన హాస్యంతో, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొని, తన సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అలాగే తన తండ్రి గురించి, ఆయన నిర్మించిన సినిమాల గురించి వివరించారు రఘుబాబు.

ఆ సినిమా దెబ్బకు మొత్తం పోగొట్టుకున్నాం.. చివరకు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.
Raghu Babu
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2026 | 8:36 AM

Share

ప్రముఖ నటుడు రఘుబాబు తన కుటుంబ సినీ ప్రస్థానంలో, ముఖ్యంగా తన తండ్రి గిరిబాబు నిర్మాతగా ఎదుర్కొన్న ఆర్థిక పోరాటాలు,  త్యాగాలను వివరించారు. నటులు నిర్మాతలు అవ్వడం సర్వసాధారణమే కానీ, నిర్మాతలు నటులు కావడం చాలా అరుదైన విషయమని, ఇది తన కుటుంబంలో ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిందని రఘుబాబు అన్నారు. గిరిబాబు మొదటి నుంచీ ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అని రఘుబాబు గుర్తు చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారితో గిరిబాబుకు చాలా సన్నిహిత సంబంధం ఉండేది. కృష్ణ గారు నిర్మించిన పద్మాలయా సినిమాల్లో గిరిబాబు లేని సినిమా లేదని, ఒకవేళ గిరిబాబు లేకపోతే, “గిరిబాబు ఏడి? రాలేదా?” అని కృష్ణ అడిగేవారని తెలిపారు. కృష్ణ గారు   నటించిన “సింహగర్జన”లాంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన గిరిబాబు, 1979లో ఆ చిత్రానికి 30 లక్షల రూపాయల భారీ బడ్జెట్ పెట్టిన విషయాన్ని రఘుబాబు ప్రస్తావించారు.

ఇది కదా సినిమా అంటే..! 10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ.. ఇప్పటికీ రికార్డే

అయితే, వారి కుటుంబానికి పెద్ద మలుపు 1990లో తన తమ్ముడిని హీరోగా పెట్టి నిర్మించిన ఇంద్రజిత్ చిత్రం అని ఆయన అన్నారు. ఆ చిత్రానికి అప్పట్లో 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారని, ఇది 35 సంవత్సరాల క్రితం, ఒక కొత్త హీరో మీద పెట్టిన చాలా పెద్ద బడ్జెట్ అని, ఇప్పటి లెక్కల ప్రకారం దాదాపు 500 కోట్ల రూపాయలకు సమానమని రఘుబాబు వివరించారు. చిత్రం విజయవంతమై, తమ్ముడికి మంచి పేరొచ్చినప్పటికీ, రావాల్సిన రెవెన్యూ రాకపోవడంతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తమ తండ్రి రెవెన్యూ వసూలు చేయడంలో బాగా బలహీనంగా, సాఫ్ట్ క్యారెక్టర్‌గా ఉండటం కూడా నష్టానికి ఒక కారణమని రఘుబాబు తెలిపారు.

ఓయమ్మో..! ఓరినాయనో..!! ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు

“ఇంద్రజిత్” సినిమా కారణంగా తమ కుటుంబం 33 లక్షల రూపాయల భారీ లోటులో కూరుకుపోయిందని రఘుబాబు అన్నారు. ఆ సమయంలో తన వయసు చాలా చిన్నదని, ఆర్థికంగా బాగా దెబ్బతిన్నామని తెలిపారు. అయితే, ఈ కష్టసమయంలో గిరిబాబు ప్రదర్శించిన నిజాయితీ మరెవ్వరూ చేయలేనిదని రఘుబాబు వివరించారు. సినిమా విడుదలకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఫైటర్స్ యూనియన్, కెమెరా డిపార్ట్‌మెంట్, ప్రసాద్ ల్యాబ్, జెమినీ కిరణ్ వంటి వారు గిరిబాబుపై ఉన్న గుడ్‌విల్‌తో సగం డబ్బులు తీసుకుని సినిమా విడుదలకు సహాయం చేశారని గుర్తుచేసుకున్నారు. చివరికి, గిరిబాబు దీనిని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా భావించి, మద్రాసులో 20-25 సంవత్సరాలుగా తాను కష్టపడి సంపాదించిన ఆస్తులన్నిటినీ అమ్మివేశారు. “ఎవ్వరూ కూడా మన ఇంటికి వచ్చి రూపాయి బ్యాలెన్స్ ఉన్నారు సార్ అని మన గేటు దగ్గరికి వచ్చి అడగకూడదు” అని, ఎవ్వరికీ ఒక్క రూపాయి బాకీ లేకుండా, వడ్డీతో సహా అప్పులన్నీ తీర్చేశారు. ఈ నిజాయితీ, త్యాగం తమకు ఒక గొప్ప చరిత్ర అని రఘుబాబు పేర్కొన్నారు. ఆర్థికంగా దెబ్బతిన్న తర్వాత, తాను పూర్తిస్థాయిలో చదువుకోలేదని, ఉద్యోగం చేద్దామంటే ఏం చేయాలో తెలియదని, తెలిసిన విద్య సినిమా ఒకటేనని, కానీ మళ్లీ సినిమా తీయడానికి పెట్టుబడి లేదని అన్నారు. తమ తండ్రి నుంచి నేర్చుకున్న గొప్ప గుణం ఏమిటంటే, ఎప్పుడూ ఎవరి ముందు చేయి చాచి దేహీ అని అడగకూడదనే సిద్ధాంతమని రఘుబాబు అన్నారు.

ఇవి కూడా చదవండి

10లక్షలకే ఇస్తా అన్నారు.. రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us