AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jellyfish Facts: జెల్లీ ఫిష్ గురించి నమ్మలేని నిజాలు..! డైనోసార్ల కంటే ముందే ఉన్నాయట..

సముద్ర జీవి అయిన జెల్లీ ఫిష్‌‌ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపరిచే ఎన్నో విషయాలు ఉన్నాయి. జెల్లీ ఫిష్‌ చేప కాదని, దాని శరీరంలో ఎక్కువ భాగం నీరేనని చాలామందికి తెలియదు. కొన్ని జాతులు విషపూరితమైనవి కాగా, మరికొన్ని చీకటిలో మెరుస్తాయి. అంతేకాదు, ‘ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్’గా పిలిచే ఓ జాతి తన జీవన దశను తిరిగి మార్చుకోగలగడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది.

Jellyfish Facts: జెల్లీ ఫిష్ గురించి నమ్మలేని నిజాలు..! డైనోసార్ల కంటే ముందే ఉన్నాయట..
Jellyfish
Janardhan Veluru
|

Updated on: Sep 19, 2026 | 3:51 PM

Share

సముద్రంలో కనిపించే అనేక వింత జీవుల్లో జెల్లీ ఫిష్‌ కూడా ఒకటి. దీన్ని చూస్తే సాధారణంగా చాలామందికి ఇది ఒక రకమైన చేపగా భావిస్తారు. కానీ నిజానికి జెల్లీ ఫిష్‌ చేప జాతికి చెందినది కాదు.. దీనికి వెన్నెముక, ఎముకలు ఉండవు. దీని శరీర నిర్మాణం కూడా ఇతర చేపలతో పూర్తిగా భిన్నంగా ఉంటుంది. జెల్లీ ఫిష్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపరిచే ఎన్నో విషయాలు ఉన్నాయి.

జెల్లీ ఫిష్‌ గురించి 10 ఆసక్తికర విషయాలు..

  1. జెల్లీ ఫిష్ శరీరంలో దాదాపు 95 శాతం నీరు ఉంటుంది. మిగిలిన భాగంలో ప్రోటీన్లు, కండరాలు, నాడీ వ్యవస్థ వంటి నిర్మాణాలు ఉంటాయి. అందుకే ఇవి చాలా మృదువుగా, పారదర్శకంగా కనిపిస్తాయి.
  2. పేరులో ‘ఫిష్’ ఉన్నప్పటికీ జెల్లీ ఫిష్‌ చేపల వర్గానికి చెందదు. చేపలకు సాధారణంగా వెన్నెముక, ఎముకలు ఉంటాయి. జెల్లీ ఫిష్‌కు ఇవేవీ ఉండవు. ఇవి తమ శరీర ఉపరితలం ద్వారా ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి.
  3. అన్ని జెల్లీ ఫిష్‌లు ఒకే స్థాయిలో ప్రమాదకరమైనవి కావు. అయితే బాక్స్ జెల్లీ ఫిష్ వంటి కొన్ని జాతులు అత్యంత విషపూరితమైనవి. వీటి టెంటకిల్స్‌లో ఉండే ప్రత్యేక కణాలు విషాన్ని విడుదల చేస్తాయి. కొన్ని జెల్లీ ఫిష్ జాతుల కాటు తీవ్రమైన ప్రభావాలను కలిగించే అవకాశముంది.
  4. జెల్లీ ఫిష్‌లు పెద్ద సంఖ్యలో ఒకచోట కనిపించినప్పుడు వాటి సమూహాన్ని ‘బ్లూమ్’, ‘స్మాక్’ లేదా ‘స్వార్మ్’ వంటి పేర్లతో పిలుస్తారు. సముద్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇవి భారీ సంఖ్యలో కనిపిస్తాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. జెల్లీ ఫిష్‌పై శాస్త్రవేత్తలు భూమిపైనే కాకుండా అంతరిక్షంలో కూడా పరిశోధనలు చేశారు. 1991లో వేలాది జెల్లీ ఫిష్‌లను అంతరిక్షానికి పంపి, గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో వాటి అభివృద్ధి ఎలా జరుగుతుందో అధ్యయనం చేశారు.
  7. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని జెల్లీ ఫిష్ జాతులను ఆహారంగా ఉపయోగిస్తారు. వీటితో సలాడ్లు, పచ్చళ్లు, ఇతర వంటకాలు తయారు చేసే సంప్రదాయం కొన్ని దేశాల్లో ఉంది. అయితే అన్ని జెల్లీ ఫిష్‌లు తినడానికి అనుకూలమైనవి కావు.
  8. ‘Turritopsis dohrnii’ అనే జెల్లీ ఫిష్ జాతి శాస్త్రవేత్తల ప్రత్యేక ఆసక్తికి కారణమైంది. అనుకూల పరిస్థితుల్లో ఈ జీవి తన అభివృద్ధి దశను తిరిగి మార్చుకుని చిన్న దశకు వెళ్లగలదు. అందుకే దీనిని సాధారణంగా ‘ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్’ అని పిలుస్తారు. అయితే దీనికి ఎప్పటికీ చనిపోదనే అర్థం కాదు. వ్యాధులు, గాయాలు, ఇతర వేటాడే జీవులు వంటి కారణాలతో ఇవి మరణించవచ్చు.
  9. జెల్లీ ఫిష్‌లకు ఎముకలు లేకపోయినా వాటి పురాతన ఉనికికి సంబంధించిన శిలాజ ఆధారాలు లభించాయి. ఇవి భూమిపై చాలా పురాతన కాలం నుంచి.. అంటే డైనోసార్ల కంటే ముందు నుంచే ఉన్న జీవులలో ఒకటిగా పరిశోధనల్లో తేలింది.
  10. కొన్ని జెల్లీ ఫిష్ జాతులు బయోల్యూమినిసెన్స్ అనే లక్షణం వల్ల చీకటిలో వెలుగులు విరజిమ్ముతాయి. అంటే ప్రత్యేకమైన జీవరసాయన చర్యల ద్వారా అవి కాంతిని ఉత్పత్తి చేస్తాయి. సముద్రంలో రాత్రివేళ ఇవి మెరుస్తూ కనిపించడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
  11. జెల్లీ ఫిష్‌లు చూడటానికి ఎంతో సున్నితంగా కనిపించినప్పటికీ, వాటి జీవన విధానం మాత్రం చాలా ప్రత్యేకమైనది. సముద్ర పర్యావరణ వ్యవస్థలో వీటికి కూడా కీలకమైన స్థానం ఉంది.

Follow Us