ఇంగ్లిష్ “రామాయణం”లో కీలక మార్పులు.. పాటలు ఉండవన్న మేకర్స్
'రామాయణం' సినిమాను భారతీయ ఇంకా అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఒక భారీ దృశ్యకావ్యంగా తెరకెక్కిస్తున్నారు. అయితే, అన్ని మార్కెట్లలోనూ ఈ చిత్రం ఒకేలా ఉండదని తెలుస్తోంది. , 'రామాయణం' ఇంగ్లీష్ వెర్షన్ నిడివి, హిందీ వెర్షన్‌తో పోలిస్తే దాదాపు 30 నిమిషాలు తక్కువగా ఉంటుంది. అలాగే, గ్లోబల్ ఆడియెన్స్ కోసం 'రామాయణం'లో పాటలు ఉండవని తెలుస్తోంది!

భారతీయ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం ‘రామాయణం’ నుంచి తాజా అప్ డేట్ వచ్చేసింది. ఈ ఎపిక్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో ఏకంగా 100 కోట్ల డిజిటల్ వ్యూస్ సాధించి ఆల్‌టైమ్ రికార్డులను బ్రేక్ చేసింది.
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణం’ సినిమాను భారతీయ ఇంకా అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఒక భారీ దృశ్యకావ్యంగా తెరకెక్కిస్తున్నారు. అయితే, అన్ని మార్కెట్లలోనూ ఈ చిత్రం ఒకేలా ఉండదని తెలుస్తోంది. ‘రామాయణం’ ఇంగ్లీష్ వెర్షన్ నిడివి, హిందీ వెర్షన్‌తో పోలిస్తే దాదాపు 30 నిమిషాలు తక్కువగా ఉంటుంది. హిందీ వెర్షన్‌తో పోలిస్తే అంతర్జాతీయ వెర్షన్ నిడివి 30 నిమిషాలు తక్కువగా ఉండనుంది. అలాగే, గ్లోబల్ ఆడియెన్స్ కోసం ‘రామాయణం’లో కీలక మార్పులు చేస్తున్నారు! గ్లోబల్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని పాటలను పూర్తిగా తొలగించారు.
అంతర్జాతీయ వెర్షన్ నిడివిని మరింత కుదించి, విదేశీ థియేటర్ ప్రేక్షకులకు తగినట్లుగా సినిమాలోని కొన్ని భాగాలను ట్రిమ్ చేయనున్నారు. దాంతో భారతీయ భాషల వెర్షన్ల కంటే పూర్తిగా భిన్నంగా ఉండనుంది. ప్రపంచ థియేటర్ ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఫార్మాట్‌లో సినిమాను వారి ముందుకు తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారు. సినిమాను అంతర్జాతీయ మార్కెట్ల కోసం ప్రత్యేకంగా లోకలైజ్ చేస్తున్నారు. కేవలం సాధారణ డబ్బింగ్‌పై ఆధారపడకుండా, నటీనటుల హావభావాలు చెక్కుచెదరకుండా టెక్నాలజీని ఉపయోగించి ఇంగ్లీష్, స్పానిష్, జపనీస్ భాషల్లోకి అనువదిస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. హిందీ సినిమాను కేవలం ఇంగ్లీషులోకి డబ్బింగ్ చేసి వదలకుండా, ప్రపంచ ఆడియెన్స్ కు తగినట్లుగా గ్లోబల్ వెర్షన్‌ను తీర్చిదిద్దుతున్నారు.
రెండు భాగాలుగా చిత్రం
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. మొదటి భాగం 2026 నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో సెల్యులాయిడ్ అద్భుతాన్ని రూ. 4,000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. నమిత్ మల్హోత్రా , యశ్ కలిసికట్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సంస్థ ‘DNEG’ విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తుండగా ప్రీమియం ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్లలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందిస్తున్నారు.
మొదలైన మ్యూజికల్ మ్యాజిక్
రామాయణ మ్యూజికల్ మ్యాజిక్ మొదలైంది! ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన ఫస్ట్ సాంగ్ ‘జై జై రామ్’ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ‘జై జై రామ్’ పాట పూర్తిగా భక్తిభావంతో నిండి ఉండటంతో పాటు, వినాయక చవితి కానుకగా రావడంతో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. రెహమాన్ మార్క్ సంగీతం శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది. గాయకులు అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషాల్ తమ మధురమైన గొంతుతో పాటకు ప్రాణం పోశారు. కుమార్ విశ్వాస్ అందించిన సాహిత్యం పాటకు మరింత వన్నె తెచ్చింది. శ్రీరాముడి దివ్యత్వాన్ని, ధర్మాన్ని చాటిచెప్పేలా ఉన్న పాట ప్రతీ శ్రోత హృదయాన్ని తాకుతోంది. ఇక హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటం విశేషం.
వినాయక చవితి పర్వదినాన విడుదలైన శ్రీరాముడు, సీతాదేవిల ప్రత్యేక పోస్టర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. దైవిక కళతో, అత్యంత ఆకర్షణీయంగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు.