AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాడ్ లక్ బ్యూటీ.! 9 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్.. అయినా తగ్గని క్రేజ్

కొత్త అందాలు ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సినిమా సినిమాకు కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతున్నారు. ఇదే సమయంలో కొందరు హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే పాపులర్ అవుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారిపోయారు .

బ్యాడ్ లక్ బ్యూటీ.! 9 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్.. అయినా తగ్గని క్రేజ్
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 19, 2026 | 12:30 PM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకునే వారు కొందరైతే.. వరుస అవకాశాలు వచ్చినా స్టార్‌డమ్‌ను అందుకోలేని వారు మరికొందరు. అయితే కెరీర్ మంచి జోరులో ఉన్న సమయంలో అనుకోని ప్రమాదం ఎదురై, కొంతకాలం సినిమాలకు పూర్తిగా దూరమైన నటీమణులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేసి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. నటనతో పాటు గ్లామర్ తో కుర్రకారును కవ్వించింది. 9 సినిమాలు చేస్తే కేవలం ఒకే ఒక్క సినిమా హిట్ అయ్యింది. అయినా కూడా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆమె మరెవరో కాదు వయ్యారాల భామ నభా నటేష్.

Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ

తెలుగు ప్రేక్షకులకు తన అందం, అభినయంతో దగ్గరైన నభా నటేష్.. కొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె ప్రయాణం మాత్రం అనుకున్నంత సాఫీగా సాగలేదు. ఒకవైపు సినిమాలు, మరోవైపు అనుకోని ప్రమాదం.. ఇలా కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తోంది. నభా నటేష్ హీరోయిన్‌గా ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.  ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. నభా నటేష్ నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. నభా నటేష్ కెరీర్‌లో అసలైన టర్నింగ్ పాయింట్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో నభాకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఈ చిత్రంలో ఆమె గ్లామర్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది

‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత నభాకు వరుస అవకాశాలు వచ్చినప్పటికీ.. ఆ స్థాయి విజయాలు మాత్రం ఎక్కువగా దక్కలేదు. అయినప్పటికీ తనకు వచ్చిన పాత్రలను చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగింది. అవకాశాలు వరుసగా వస్తున్న సమయంలో నభా నటేష్ జీవితంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఆమె రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదం కారణంగా చాలా కాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దాదాపు రెండేళ్ల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ సినిమాల వైపు అడుగులు వేసింది.  కానీ ఈ అమ్మడికి హిట్స్ మాత్రం రావడం లేదు. చేసిన సినిమాలన్నీ నిరాశపరుస్తున్నాయి. ఇటీవలే నభా నటేష్ ‘నాగబంధం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు స్వయంభు అనే సినిమాతో రాబోతుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా నభా నటేష్ యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోషూట్స్, ఫ్యాషన్ లుక్స్, గ్లామరస్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది నభా నటేష్.

అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us