విభిన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న పూజిత 

19 September  2026

Rajeev 

Pic credit - Instagram

తెలుగు సినీ పరిశ్రమలో అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో పూజిత పొన్నడ ఒకరు.

గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథలో ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లను ఎంచుకుంటూ తన నటనా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల్లోనూ నటించిన పూజిత.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా మారుతోంది.

సినిమాల్లోకి రాకముందు టీసీఎస్‌లో ఉద్యోగం చేసింది. అయితే నటనపై ఉన్న ఆసక్తితో సినీ రంగం వైపు అడుగులు వేసింది.

2015లో ‘ఉప్మా తినేసింది’ అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా కెరీర్ ప్రారంభించిన పూజిత.. ఆ తర్వాత టాలీవుడ్‌లో అవకాశాలు అందుకుంది.

‘ఊపిరి’ సినిమాతో తెలుగు తెరపై కనిపించిన ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. 

రంగస్థలం’ హ్యాపీ వెడ్డింగ్’, ‘రాజు గాడు’, ‘మిస్ ఇండియా’, ‘రావణాసుర’, ‘ఓదెల రైల్వే స్టేషన్’ వంటి సినిమాల్లో విభిన్న పాత్రలు చేసింది.