AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10లక్షలకే ఇస్తా అన్నారు.. రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు

పెళ్లీ ఫేమ్ పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సహనటుడుగా.. ప్రతి నాయకుడిగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు పృథ్వీ. కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన.. ఇటీవలే రీఎంట్రీ ఇచ్చారు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు పృథ్వీరాజ్ .

10లక్షలకే ఇస్తా అన్నారు.. రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు
Prithiveeraj
Rajeev Rayala
|

Updated on: Aug 28, 2026 | 6:47 PM

Share

చిత్రపరిశ్రమలో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే విలక్షణ నటులలో పృథ్వీ ఒకరు. డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన పెళ్లి సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించారు. 1997లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. అంతేకాకుండా.. ఈ మూవీతో పృథ్వీకి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. దీంతో తెలుగులో వరుస అవకాశాలను అందుకున్నారు. విలన్‏గానే కాకుండా తన కామెడీ టైమింగ్‏తో ఆడియన్స్ ను అలరించారు. సమరసింహారెడ్డి, నువ్వు నాకు నచ్చావ్, దేవుళ్లు, ప్రేయసి రావే వంటి చిత్రాల్లో నటిస్తూ.. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఆయన సినిమాలకు దూరమయ్యారు. చాలా కాలం వెండితెరపై పృథ్వీ కనిపించలేదు. ఇక ఇటీవలే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు పృథ్వీ.యానిమల్ , సంక్రాంతికి వస్తున్నాం, తండేల్ సినిమాల్లో నటించి మెప్పించారు.

ఆయన లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు.. నన్ను స్టార్ హీరోయిన్‌ను చేశారు

అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పృథ్వీ తన కెరీర్‌లో ఒక పెద్ద భూమి కొనుగోలు అవకాశాన్ని ఎలా కోల్పోయారో  ఒక సందర్భంలో పంచుకున్నారు. 1996, 1997 ప్రాంతంలో, ఒక సినిమాకు గాను ఆయనకు పది లక్షల రూపాయల రెమ్యూనరేషన్ లభించిందట. ఆ డబ్బుతో శంషాబాద్ ప్రాంతంలో భూమి కొనుగోలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారట. అప్పట్లో శంషాబాద్‌లో వంద ఎకరాల భూమి కేవలం పది లక్షల రూపాయలకే రావడం ఆయనను ఆశ్చర్యపరిచింది. బంజారా హిల్స్‌లో ఫ్లాట్ కొనుగోలు చేయాలా లేక ఈ పెద్ద భూమిని తీసుకోవాలా అన్న గందరగోళంలో పృథ్వీ రాజ్ ఉన్నాను. అదే టైంలో భూమిని పరిశీలించడానికి వెళ్లినప్పుడు, ఆయన డ్రైవర్ ఆ భూమి అంతా రాళ్లతో నిండి ఉందని, కంచె వేయడానికే ఇరవై లక్షల రూపాయలు అవుతుందని చెప్పి ఆయనను నిరుత్సాహపరిచాడట.

మహేష్‌తో ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.! రీసెంట్‌గానే హిట్ కొట్టాడు

డ్రైవర్ మాటలు విని, పృథ్వీ రాజ్ ఆ భూమిని కొనుగోలు చేయకుండా వెనక్కి వచ్చి ఒక చిన్న ఫ్లాట్ తీసుకున్నారట. అయితే, ఆయనకు తెలియని విషయం ఏమిటంటే, ఆ వంద ఎకరాల్లోనే కాలక్రమేణా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ, తన డ్రైవర్ సలహా వల్ల తాను ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయానని పృథ్వీ సరదాగా అన్నారు. అప్పుడు పదిలక్షలు.. ఇప్పుడు వందల కోట్లు అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

చిరంజీవి ఇష్టమైన బాలయ్య సినిమా ఎదో తెలుసా.? ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ అది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us