AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్‌తో ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.! రీసెంట్‌గానే హిట్ కొట్టాడు

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను యాక్షన్ అడ్వాంచరల్ కథతో తెరకెక్కిస్తున్నారు జక్కన్న. దాంతో ఈ సినిమా కోసం మహేష్ బాబు నయా లుక్ లోకి మారిపోయాడు. అలాగే బాడీని కూడా డవలప్ చేశారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించనున్నారని తెలుస్తోంది.

మహేష్‌తో ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.! రీసెంట్‌గానే హిట్ కొట్టాడు
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Aug 27, 2026 | 12:34 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఇదిలా ఉంటే మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యులే కాదు సినీ సెలబ్రెటీలలో కూడా మహేష్ బాబుకు అభిమానులు ఉన్నారు.ఇదిలా ఉంటే మహేష్ బాబు త్రో బ్యాక్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పైన కనిపిస్తున్న ఫోటో చూశారా.? ఆ ఫొటోలో మహేష్ బాబుతో ఉన్నది ఓ స్టార్ హీరో. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఆ యంగ్ హీరో. ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా .?

ఏంది భయ్యా ఈ సిరీస్ ఇలా ఉంది..! పచ్చి బూతులు, బోల్డ్ సీన్స్.. ఒంటరిగా చూడాల్సిందే

మహేష్ బాబుతో నటించిన చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. తేజ సజ్జ, శ్రీదివ్య ఇలా చాలా మంది ఒకప్పుడు మహేష్ బాబు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించారు. అయితే పై ఫొటోలో మహేష్ తో ఉన్నది చైల్డ్ ఆర్టిస్ట్ కాదు. కానీ ఇప్పుడు స్టార్ హీరో.. ఈ ఫొటోలో మహేష్ బాబుతో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా.? అతను టాలీవుడ్ లో క్రేజీ హీరో.. అంతే కాదు ఓ స్టార్ హీరో కొడుకు కూడా.. ఇంతకూ ఆయన ఎవరంటే.. పై ఫొటోలో మహేష్ బాబుతో ఉన్నది స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. ఈ యంగ్ హీరో నిర్మల కాన్వెంట్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

ఇవి కూడా చదవండి

అతను కమెడియన్ కాదు దేవుడు..! సాయం చేయమని కోరితే.. 3 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చాడు..

ఆ తర్వాత పెళ్లి సందడి సినిమాతో ఫుల్ లెన్త్ హీరోగా మారి ప్రేక్షకులను అలరించాడు. పెళ్లి సందడి సినిమా మంచి విజయం సాదించడమతొ రోషన్ క్రేజ్ పెరిగిపోయింది. ఇటీవలే ఛాంపియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోషన్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు రోషన్. కాగా మహేష్ బాబుతో రోషన్ చిన్నప్పుడు దిగిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు అప్పుడు ఇప్పుడు అలానే ఉన్నారు. రోషన్ మాత్రం పెరిగి పెద్దయ్యాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు అభిమానులు ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..! మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ

View this post on Instagram

A post shared by Roshann meka (@iamrshn)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us