AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతను కమెడియన్ కాదు దేవుడు..! సాయం చేయమని కోరితే.. 3 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చాడు..

1989లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమాతోనే ఉత్తేజ కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా మెప్పించాడు. కేవలం నటుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్ గా, డైలాగ్ రైటర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ సత్తా చాటారు ఉత్తేజ్.

అతను కమెడియన్ కాదు దేవుడు..! సాయం చేయమని కోరితే.. 3 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చాడు..
Uttej
Rajeev Rayala
|

Updated on: Aug 26, 2026 | 11:53 AM

Share

ఓ వేడుకలో నటుడు ఉత్తేజ్ దివంగత హాస్యనటుడు వేణుమాధవ్ గురించి భావోద్వేగంగా మాట్లాడారు. కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన వేణు మాధవ్.. తన కామెడీతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. ఆయన మారణం ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా ఉత్తేజ్ ఓ సందర్భంలో  వేణుమాధవ్ గురించి మాట్లాడుతూ..  వేణుమాధవ్ ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మానవత్వం ఉన్న వ్యక్తి అనే విషయాన్ని తెలియజేసే ఒక సంఘటనను ఈ సందర్భంగా ఉత్తేజ్ సభికులతో పంచుకున్నారు. ఈ సంఘటన వేణుమాధవ్ కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా, ఒక మంచి మనిషిగా ఎంతమందికి గుర్తుండిపోయారో తెలియజేస్తుంది.

Jabardasth Naresh: మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు నాకు ఇచ్చేది ఎంతంటే

ఉత్తేజ్ వివరించిన దాని ప్రకారం.. ఒకసారి ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది.. ఆ సమయంలో ఒక నటుడు వేణుమాధవ్‌ను కలిశాడు. తన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, సంసారం గడవడం చాలా కష్టంగా ఉందని, ఏదైనా సినిమా అవకాశాలు కల్పించమని, లేదా కొంత ఆర్థిక సహాయం చేయమని వేడుకున్నాడట. వేణుమాధవ్ ఆ నటుడి మాటలను ఓపిగ్గా విని.. వెంటనే సహాయం చేస్తానని హామీ ఇవ్వకుండా, ముందుగా అతన్ని లంచ్ చేయమని చెప్పాడట. “నువ్వైతే అన్నం తిను” అని చెప్పి, ఆ తర్వాత విషయం చూద్దామని అన్నాడట వేణు మాధవ్. మధ్యాహ్న భోజనం తర్వాత, ఆ నటుడు మళ్ళీ వేణుమాధవ్‌ను కలిసి తన పరిస్థితిని వివరించాడట.

రూ. 65కోట్లు పెడితే.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. డిజాస్టర్ దెబ్బకు హీరో రూపాయి కూడా తీసుకోలేదు

ఆతర్వాత వేణుమాధవ్ తన పనిలో బిజీగా ఉన్నాడు. ఆ నటుడు, అలాగే ఉత్తేజ్ కూడా, వేణుమాధవ్ కొంత నగదు సహాయం చేస్తారని అనుకోని ఎదురుచూస్తున్నారట. షూటింగ్ పూర్తయి ప్యాకప్ అయిన తర్వాత, వేణుమాధవ్ ఉత్తేజ్‌ను తన వద్దకు పిలిచారట. అప్పట్లో వేణుమాధవ్ కారు చాలా పెద్దది, ఇన్నోవా లాంటిది అని ఉత్తేజ్ గుర్తు చేసుకున్నారు. వేణుమాధవ్ తన కారు వెనుక డోర్ తెరిచి చూపించగా, ఉత్తేజ్ ఆశ్చర్యపోయారట. అందులో రెండు బస్తాల బియ్యం, 10 కిలోల కందిపప్పు, 10 కిలోల పెసరపప్పుతో పాటు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వంటి ప్రతి నిత్యావసర వస్తువు నిండి ఉన్నాయి. ఈ సరుకులన్నీ కలిపి సుమారు రెండు నుండి మూడు నెలలకు సరిపడా ఉంటాయని ఉత్తేజ్ పేర్కొన్నారు. అప్పుడు వేణుమాధవ్, ఉత్తేజ్‌తో “అన్నా, ఇది తిప్పి తిప్పి కొడితే 20,000 లోపు వచ్చాయన్నా. కానీ వీడికి నేను 25,000 ఇస్తే, ఇవాళ రేపు అయిపోద్ది, పెళ్ళాం పిల్లలు ఆకలితోనే ఉంటారు. ఇది నేను చేసే సహాయం అన్నాను.” అని వేణుమాధవ్ అన్నారట. చేతికి డబ్బులు ఇస్తే అవి త్వరగా ఖర్చైపోతాయని, కానీ నిత్యావసర సరుకులు అందిస్తే కనీసం రెండు నెలల పాటు ఆ కుటుంబం కడుపు నిండా తినగలదని ఆయన ముందుచూపుతో ఆలోచించాడని ఉత్తేజ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆ హీరోలతో సినిమాలు చేయడం కష్టం.. నా వల్ల కాదు! ఓపెన్‌గా చెప్పేసిన తేజ

Venu Madhav

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us