అవును.. ప్రేమకథ చిత్రం హీరోయిన్ ఏమైపోయింది..! భలే ఉండేది క్యూట్‌గా..
చారడేసి కళ్లు.. ముగ్ధమనోహరమైన రూపం.. ఇలా చూడగానే ఇట్టే ఆకట్టుకునే అందం. అయితే ఆ చారడేసి కళ్లతోనే ప్రేమకథా చిత్రమ్ సినిమాలో అందరినీ భయపెట్టింది నందితా రాజ్. మారుతి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ కామెడీ హర్రర్ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. డైరెక్టర్‌గా మారుతికి, హీరోగా సుధీర్‌బాబుకి మంచి బ్రేక్ ఇచ్చింది.

సుధీర్ బాబు హీరోగా నటించిన ప్రేమ కథ చిత్రం సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. 2013 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నందిత రాజ్ నటించింది. సప్తగిరి, ప్రవీణ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో సప్తగిరి చేసిన కామెడీ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. అలాగే హీరోయిన్ నందిత తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. గ్లామర్ పరంగా ఈ చిన్నదానికి మంచి మార్కులు పడ్డాయి. ఓరిమకథ చిత్రం తర్వాత ఈ అమ్మడు పెద్ద హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఊహించని విధంగా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ తగ్గిపోయాయి. అయితే ఈ సినిమా తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు నందిత.
ఆయన లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు.. నన్ను స్టార్ హీరోయిన్‌ను చేశారు
నిజానికి తేజ దర్శకత్వం వహించిన నీకు నాకు డాష్ డాష్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత వచ్చిన ప్రేమ కథ చిత్రం ఈ అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రేమ కథ చిత్రం సినిమా తర్వాత నందిత వరుసగా సినిమాలు చేసింది. మరోసారి సుధీర్ బాబుతో కలిసి కృష్ణమ్మ కలిపింది నిన్ను నన్ను సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆతర్వాత మళ్లీ కనిపించలేదు ఈ అమ్మడు.
మహేష్‌తో ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.! రీసెంట్‌గానే హిట్ కొట్టాడు
అయితే ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.? అంటూ నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. సందిత 2019లో విశ్వమిత్ర అనే సినిమాలో నటించింది. ఆతర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది యాక్టివ్ గా ఉండదు. దాంతో ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోస్ కోసం నెటిజన్స్ కాస్త గట్టిగానే గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోల పై మీరూ ఓ లుక్కెయండి.
చిరంజీవి ఇష్టమైన బాలయ్య సినిమా ఎదో తెలుసా.? ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ అది
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




