AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ రూట్ ఫిక్స్.. తక్కువ ధరలో వందే భారత్ తరహా ప్రయాణం..

తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మరో అమృత్ భారత్ రైలు ఏపీ, తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే అనేక రైళ్లు అందుబాటులో ఉండగా.. రేణిగుంట మీదుగా మరో రైలు అందుబాటులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఉపయోగపడనుంది.

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ రూట్ ఫిక్స్.. తక్కువ ధరలో వందే భారత్ తరహా ప్రయాణం..
Amrit Bharat Express
Venkatrao Lella
|

Updated on: Aug 29, 2026 | 9:00 AM

Share

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వేశాఖ ప్రకటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ రైళ్లు సదూర ప్రాంతాలకు వెళ్తుండగా.. ఇప్పుడు మరో రైలును కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ ట్రైన్‌కు సంబంధించి టైమ్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఈ కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో ప్రయోజనం చేకూరనుంది. ధన్ బాద్-కోయంబత్తూర్-ధన్ బాద్ మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. సామాన్య ప్రయాణికులకు అందుబాటులో ధరల్లో సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు దీనిని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

టైమ్ షెడ్యూల్ ఇదే..

ధన్ బాద్-కోయంబత్తూర్(22363) వీక్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రతీ శనివారం సాయంత్రం 4.10 గంటలకు ధన్ బాద్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. ఇది బలార్ష, సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట, తిరుత్తని, కాట్పాడి, జోలార్ పెట్టి, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ మీదుగా కోయంబత్తూరుకి చేరుకుంటుంది. ఆదివారం రాత్రి 9 గంటలకు బలార్షకు చేరుకోనుండగా.. రాత్రి 10 గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్‌కు చేరుకుంటుంది. అక్కడ నుంచి బయల్దేరి సోమవారం అర్థరాత్రి 12.08 గంటలు వరంగల్, తెల్లవారుజామున 3.45 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఆ తర్వాత 10.15 గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది.

వందే భారత్ తరహాలో సౌకర్యాలు

ఇక తిరుగు ప్రయాణంలో కోయంబత్తూర్-ధన్ బాద్(22364) ఎక్స్‌ప్రెస్ ప్రతీ మంగళవారం ఉదయం 7.50 గంటలకు కోయంబత్తూరులో బయల్దేరుతుంది. తిరుప్పూర్, కాట్పాడి, తిరుత్తని, రేణిగుంట మీదుగా ప్రయాణించి రాత్రి 9.40 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఆ తర్వాత అర్థరాత్రి 1.18 గంటలకు వరంగల్‌కు చేరుకోనుండగా.. ఆ ఆ తర్వాత పెద్దపల్లి, మంచిర్యాల, కాగజ్ నగర్, బలార్ష మీదుగా గురువారం మధ్యాహ్నం 1 గంటలకు ధన్ బాద్ చేరుకుంటుంది. సదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రజలకు ఇది ఎంతో ఉపయోపగడుతుంది. ఛార్జీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో జనరల్, స్లీపర్ కోచ్‌లు ఉండనుండగా.. ఏసీ కోచ్‌లు ఉండవు. కానీ వందే భారత్ తరహాలో సౌకర్యాలు ఉంటాయి. వందే భారత్ రైళ్ల వేగాన్ని అందుకునేలా ఈ రైళ్లను తీర్దిదిద్దారు. త్వరలో ఈ రైళ్లల్లో ఏసీ కోచ్‌లు కూడా అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు.  2023లో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వేశాఖ ప్రారంభించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 60కిపైగా అమృత్ భారత్ రైళ్లు సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. వీటిని దూర ప్రాంతాలకు తిప్పుతున్నారు. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే వీటి వేగం ఎక్కువగా ఉంటుంది.

Follow Us