ఆటో డెబిట్ పేమెంట్లకు కూడా యూపీఐ ఛార్జీలు వర్తిస్తాయా..?

Venkatrao Lella

Images: Pinterest

16 Sep 2026

కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీ నుంచి కొత్త యూపీఐ నిబంధనలు తీసుకొస్తుంది. ఇప్పటివరకు ఉచితంగా యూపీఐ లావాదేవీలు అందించగా.. ఇక నుంచి వ్యాపారులకు ఎండీఆర్ చార్జీలు విధించనున్నారు.

రూ.2 వేలపైబడి వ్యాపారుల వద్ద చేసే లావాదేవీలకు 0.4 శాతం ఛార్జీలు పడనున్నాయి. రూ.2 వేలలోపు పేమెంట్లకు జీరో ఎండీఆర్ చార్జీలు నిర్ణయించారు.

వ్యాపారుల వద్ద రూ.75 వేలుబడి చేసే లావాదేవీలకు గరిష్టంగా రూ.300 ఎండీఆర్ ఛార్జీలు ఫిక్స్ చేశారు. ఇక రూ.2 వేలుపైబడిన రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధన చెల్లింపులకు రూ.5 ఫ్లాట్ ఛార్జీలు విధించనున్నట్లు ఎన్‌పీసీఐ ప్రకటించింది.

అయితే వ్యాపారులు ఈ ఎండీఆర్ ఛార్జీలను భరించాల్సి ఉంటుంది. కొనుగోలుదారులపై మోపడానికి వీల్లేదు. కస్టమర్ల నుంచి అసలు ధర మాత్రమే తీసుకోవాలి

యుటిలిటీ బిల్లులు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల వంటి ఆటో డెబిట్ పేమెంట్లకు ఎండీఆర్ ఛార్జీలు వర్తించవు. యూపీఐ ఆటోపే ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు వర్తించవు.

చిన్న వ్యాపారులకు రూ.లక్ష పరిమితి విధించారు. రూ.లక్ష వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. నెలకు రూ.లక్ష వరకు పరిమితి ఉంటుంది.

ప్రస్తుతం ప్రకటించిన ఎండీఆర్ ఛార్జీలు కేవలం యూపీఐ ఉపయోగించి బ్యాంక్ ఖాతా నుంచి చేసే ట్రాన్సాక్షన్లకు మాత్రమే వర్తిస్తాయి. మిగతా లావాదేవీలకు వేర్వేరు ఎండీఆర్ ఛార్జీలు వసూలు చేస్తారు.

ప్రస్తుతం క్రెడిట్ కార్డు లావాదేవీలకు 1.5 శాతం నుంచి 2.5 శాతం వరకు ఛార్జీలు విధిస్తున్నారు. ఇక డెబిట్ కార్డు లావాదేవీలకు 0.90 శాతం చార్జీలు ఉంది. వాటితో పోలిస్తే యూపీఐ ఛార్జీలు తక్కువ.

ఇక యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్ ఎలాంటి ఫ్లాట్ ఫామ్ చార్జీలు, ఇతర ఛార్జీలు వసూలు చేయకూడదు. ఈ మేరకు ఎన్‌పీసీఐ ఆంక్షలు విధించింది.