AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో క్రేజీ సినిమాను ఒకే చేసిన మాస్ రాజా.. ఆ యంగ్ డైరెక్టర్‌తో రవితేజ

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరుముడి మేనియా నడుస్తుంది. మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియ భవానీ శంకర్ నటించగా.. కేరళ చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర మనమ్మ పాత్రలో ఒదిగిపోయింది.

మరో క్రేజీ సినిమాను ఒకే చేసిన మాస్ రాజా.. ఆ యంగ్ డైరెక్టర్‌తో రవితేజ
Raviteja
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2026 | 7:39 AM

Share

రవితేజ నటించిన ఇరుముడి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. శివ నిర్వాణం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. వరుసగా సెలవలు రావడంతో థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో రవితేజ తన నటనతో ప్రేక్షకులను మరోసారి కట్టిపడేసింది. ఇక ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అలాగే ఇరుముడి సినిమా ఇప్పుడు రూ. 135 కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియాట్ చేసింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ నెక్స్ట్ ఎవరితో సినిమా చేయనున్నాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే రవితేజ ఇరుముడి సినిమా తర్వాత ఓ యంగ్ డైరెక్టర్ తో కలిసి సినిమా చేయనున్నారు. ఆ దర్శకుడి ఎవరో కాదు వివేక్ ఆత్రేయ తో రవితేజ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. వివేక్ నానితో కలిసి అంటే సుందరానికి, సరిపోదా శనివారం సినిమాలతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఇటీవలే హసిత్ గోలి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రకటించారు రవి తేజ. తాజాగా రాఖీ పండగ సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు.

‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికీ’, ‘సరిపోదా శనివారం’ ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వివేక్ ఇప్పుడు ఓ ఆసక్తికర కథతో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇరుముడి విజయం సాధించడంతో దర్శకుడు వివేక్ ఆత్రేయ, నిర్మాతలు లక్ష్మణ్, శ్రీని.. రవితేజను కలిసి అభినందనలు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్స్ రానున్నాయి. ఇక హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ చేస్తున్న సినిమాకు దాగుడు మూతలు దండాకోర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో శ్రీవిష్ణు కూడా నటించనున్నారని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us