AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొని తెచ్చుకున్న కొరివి.. టెక్సాస్‌ను వణికిస్తున్న భారతీయ నీల్గాయ్‌లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?

వందేళ్ల క్రితం సరదాగా, మాంసం కోసం భారత్ నుంచి టెక్సాస్‌కు తీసుకెళ్లిన నీల్గాయ్‌లు.. ఇప్పుడు అక్కడి జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తీసుకెళ్లినప్పుడు కేవలం 10 సంఖ్యంలో ఉన్న ఈ జంతువులు.. ఇప్పుడు వేలల్లోకి పెరిగి స్థానిక రైతులను, అధికారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. అసలు అమెరికాలో మన నీల్గాయ్‌ల హవా ఏంటి? తెలుసుకుందాం పదండి.

కొని తెచ్చుకున్న కొరివి.. టెక్సాస్‌ను వణికిస్తున్న భారతీయ నీల్గాయ్‌లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?
Nilgai Antelopes Are Ruining Texas Farms
Sukumaar DG - Associate Editor
| Edited By: |

Updated on: Aug 10, 2026 | 8:26 AM

Share

ఆపదను అరువు తెచ్చుకోవడం అంటే ఇదేనేమో.. ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ విదేశీ అడవి జంతువుల బెడద తీవ్రరూపం దాల్చింది. భారతదేశానికి చెందిన అతిపెద్ద యాంటీలోప్ జాతికి చెందిన ‘నీల్గాయ్’ జంతువుల సంఖ్య అక్కడ అనియంత్రితంగా పెరిగిపోయింది. క్రమంగా తమ సంఖ్యను పెంచుకున్న నీల్గాయ్‌లు.. ఇప్పుడు స్థానిక వణ్యప్రాణులు, రైతులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి.

వంద ఏళ్ల క్రితం దిగుమతి

సుమారు వంద సంవత్సరాల క్రితం మాంసం ఉత్పత్తి, ప్రయోగాల కోసం కొన్ని నీల్గాయ్ జంతువులను భారత్ నుంచి టెక్సాస్‌కు తీసుకెళ్లారు. అయితే దక్షిణ టెక్సాస్ భౌగోళిక పరిస్థితులు, వాతావరణం వీటి మనుగడకు అత్యంత అనుకూలంగా మారడంతో ఇవి వేగంగా సంతానోత్పత్తి చేశాయి.

సహజ శత్రువులు లేకపోవడమే శాపం

ఆ ప్రాంతంలో వీటిని వేటాడే సహజ శత్రువులు అంటే క్రూర మృగాలు వంటివి లేకపోవడం ఈ నీల్గాయ్ జనాభా విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. భారత్‌ నుంచి తీసుకెళ్లిన ప్రారంభంలో కేవలం పదుల సంఖ్యలో ఉన్న ఈ జీవులు, కాలంతో పాటు క్రమంగా తమ సంఖ్యను పెంచుకుంటూ ప్రస్తుతం 50 వేలకు పైగా చేరినట్టు అధికారులు చెబుతున్నారు.

వ్యవసాయం, పర్యావరణంపై దెబ్బ

ఈ విపరీతమైన పెరుగుదల ఇప్పుడు స్థానికంగా నివసించే వణ్య ప్రాణులకు, రైతులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇవి ఆహారం, నీటి కోసం స్థానిక వన్యప్రాణులతో పోటీ పడుతుండటంతో పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయండంతో పాటు సరిహద్దులను దాటి గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయ పంటలను పాడు చేస్తున్నాయి. అంతేకాదు ఈ నీల్గాయ్‌ల ద్వారా స్థానిక పశువులకు ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పశుసంవర్ధక శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

స్పష్టత లేని నివారణ చర్యలు

మరోవైపు, కొందరు వ్యాపారులు ఈ నీల్గాయ్‌ల వేటను లాభసాటి టూరిజంగా మలుచుకుంటున్నప్పటికీ, వీటి సంఖ్యను పూర్తిగా అదుపు చేసేందుకు అధికారుల వద్ద స్పష్టమైన నివారణ ప్రణాళిక కొరవడింది. రోజురోజుకూ పెరుగుతున్న నీల్గాయ్ ముప్పుతో స్థానిక రైతులు, నివాసితులు భయాందోళనకు గురవుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ రంగుల గొట్టం కేవలం అలంకారం కాదు.. అసలు సీక్రెట్ ఇదే..!
ఈ రంగుల గొట్టం కేవలం అలంకారం కాదు.. అసలు సీక్రెట్ ఇదే..!
అమెరికాలో నీల్గాయ్‌ల రచ్చ.. అధికారులకు నిద్రలేని రాత్రులు
అమెరికాలో నీల్గాయ్‌ల రచ్చ.. అధికారులకు నిద్రలేని రాత్రులు
ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు!
ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు!
స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ?
స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ?
RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం!
RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం!
GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!
GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో..
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో..
వార్మప్‌తో ఆ ఇద్దరు ఔట్.. లంకతో తొలి టెస్ట్‌కు భారత జట్టు ఇదే..?
వార్మప్‌తో ఆ ఇద్దరు ఔట్.. లంకతో తొలి టెస్ట్‌కు భారత జట్టు ఇదే..?
ఎలా వస్తాయ్ రా ఈ ఐడియాలు.. బంగారం స్మగ్లింగ్ ఎలా చేశాడో తెలిస్తే.
ఎలా వస్తాయ్ రా ఈ ఐడియాలు.. బంగారం స్మగ్లింగ్ ఎలా చేశాడో తెలిస్తే.
ఓర్నీ.. ఇన్ని రోజులు గుడ్డిగా తాగేశామా.. పాలు వీరికి యమడేంజర్..
ఓర్నీ.. ఇన్ని రోజులు గుడ్డిగా తాగేశామా.. పాలు వీరికి యమడేంజర్..