AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ లేడీ డైరెక్టర్ నుంచి సూర్య బతికిపోతే.. యశ్ దొరికేశాడు

ఆ లేడీ డైరెక్టర్ నుంచి సూర్య బతికిపోతే.. యశ్ దొరికేశాడు

Phani CH
| Edited By: |

Updated on: Aug 31, 2026 | 4:58 PM

Share

కేజీఎఫ్‌ 2 తర్వాత నాలుగేళ్ల గ్యాప్‌తో యశ్‌ నటించిన టాక్సిక్‌ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. యశ్‌ నటన, గ్రాండ్‌ విజువల్స్‌పై ప్రశంసలు దక్కుతుండగా, గందరగోళమైన స్క్రీన్‌ప్లే, ఎక్కువ పాత్రలు, బోల్డ్‌ యాక్షన్‌ సన్నివేశాలపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ కథను తొలుత కోలీవుడ్‌ స్టార్‌ సూర్యకు చెప్పారని, ఆయన తిరస్కరించడంతో యశ్‌ హీరోగా ఎంపికయ్యాడనే వార్త వైరల్‌గా మారింది.

కేజీఎఫ్ 2 తర్వాత సుమారు నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న రాకింగ్ స్టార్ యశ్ టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఈ సినిమా బుధవారం (ఆగస్టు 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్ లోనూ పెద్ద ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. టాక్సిక్ సినిమా స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉందని, లెక్కకు మించిన పాత్రలతో సినిమా అంతా గజిబిజీగా ఉందని, అలాగే బోల్డ్, యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని రివ్యూలు వస్తున్నాయి. అదే సమయంలో యశ్ యాక్టింగ్ అద్దిరిపోయిందని, సినిమా కూడా చాలా గ్రాండ్ గా, రిచ్ గా విజువల్ ఫీస్ట్ గా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. మొత్తానికి అభిమానుల అంచనాలను టాక్సిక్ సినిమా అందుకోలేదన్నది తెలుస్తోంది. ఇదిలా ఉంటే టాక్సిక్ సినిమా రిలీజ్ నేపథ్ంయలో ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. టాక్సిక్ సినిమా కథని యశ్ కంటే మొదట ఒక స్టార్ హీరోకి వినిపించారట దర్శక నిర్మాతలు. అయితే ఆయన ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదట. దీంతో ఫైనల్ గా యశ్ ను హీరోగా తీసుకున్నారట. టాక్సిక్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ సూర్య అని తెలుస్తోంది. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ అలాగే యాక్షన్ సీన్స్ భారీగా ఉండడంతో సూర్య ఈ సినిమాను చేసేందుకు ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఇప్పుడీ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఇక టాక్సిక్ సినిమా విషయానికి వస్తే.. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్‌స్టర్ మైండ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. . నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ఫైనల్‌ సెలబ్రిటీలు వీరే? లిస్ట్‌ చూస్తే మతిపోవడం పక్కా

Published on: Aug 29, 2026 08:19 PM
Follow Us