షాద్‌నగర్‌లోని జమలాపూర్లో రాఖీ పండుగ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతంతో నవీన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పండుగ పూట కొడుకును కోల్పోయిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మరణించిన తన సోదరుడికి చెల్లెలు కన్నీటితో కడసారి రాఖీ కట్టిన దృశ్యం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.