AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కండలు తిరిగిన దేహం.. రాజసం ఉట్టిపడే రూపం.. ఒంగోలులో 12 అడుగుల భారీ గిత్త!

ఒంగోలు పౌరుషానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే ప్రపంచ ప్రసిద్ధ ఒంగోలు జాతి గిత్తకు 12 అడుగుల భారీ విగ్రహాన్ని నగర శివారులో ఏర్పాటు చేశారు. ఒంగోలు మున్సిపాలిటీగా ఏర్పడి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ప్రముఖ శిల్పి లక్కు వర్మ జీవం ఉట్టిపడేలా గిత్త రూపాన్ని అద్భుతంగా మలిచారు. కండలు తిరిగిన దేహం, వాడి కొమ్ములు, దర్పం ఉట్టిపడే ముఖ కవళికలతో..

కండలు తిరిగిన దేహం.. రాజసం ఉట్టిపడే రూపం.. ఒంగోలులో 12 అడుగుల భారీ గిత్త!
Majestic Ongole Bull Monument
Fairoz Baig
| Edited By: |

Updated on: Aug 29, 2026 | 8:32 PM

Share

ఒంగోలు, ఆగస్ట్‌ 29: ఒంగోలు ప్రాంత పౌరుషానికి ప్రతీక ప్రపంచ ప్రసిద్ది గాంచిన ఒంగోలు గిత్తలు. ఆ పౌరుషాన్ని కళ్లకు కట్టేలా ఓ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ అదే చేసి చూపించారు. ఒంగోలు మున్సిపాలిటీగా ఆవిర్భవించి 150 సంవత్సరాల వేడుకలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో నగర శివారులో 12 అడుగుల భారీ ఒంగోలు జాతి గిత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

చూపులో పౌరుషం, ఆకారంలో మహిషం రూపంలో ఉన్న ఒంగోలు జాతి గిత్త విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి ప్రతిష్టించారు. అందుకోసం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పి లక్కు వర్మకు విగ్రహం రూపకల్పన కోసం నియమించారు. అనుకున్నట్టే ఒంగోలు గిత్త రూపాన్ని అద్భుతంగా మలిచారు శిల్పి లక్కు వర్మ. నిజంగా ఒంగోలు జాతి గిత్త నేలపై నిలబడితే ఎలా ఉంటుందో, సరిగ్గా అలాగే జీవం ఉట్టిపడేలా తయారు చేశారు.

ఇవి కూడా చదవండి

ఒంగోలు సంస్కృతికి అద్దం పట్టేలా ఒంగోలు మున్సిపాలిటీగా ఏర్పడి 150 వసంతాలూ పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఒంగోలు ప్రాంత కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటే ఈ ఒంగోలు గిత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఒంగోలు గిత్త రాజసానికి ఏమాత్రం తగ్గకుండా ఈ విగ్రహాన్ని అద్భుతంగా డిజైన్ చేశారు. కండలు తిరిగిన దేహంతో, ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఉండే గిత్త రౌద్రాన్ని కళ్లకు కట్టారు. ఒంగోలు గిత్త కళ్లు, వాడి కొమ్ములు, దర్పం ఉట్టిపడేలా ముఖ కవళికలను అద్భుతంగా చెక్కారు. ఇప్పుడు ఈ విగ్రహాన్ని చూసేందుకు ఒంగోలు చుట్టుపక్కల నుంచి జనం తరలివస్తుండటం విశేషం.

Follow Us