వైద్య రంగంలో సంచలనం సృష్టిస్తూ హెచ్ఐవీని నివారించేందుకు లెనకాపవిర్ ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చింది. మన దేశంలో రెడ్డిస్ ల్యాబ్స్, ఎంక్యూర్ సంస్థలకు దీని తయారీకి అనుమతులు లభించాయి. సంవత్సరానికి రెండుసార్లు తీసుకోవాల్సిన ఈ ఇంజెక్షన్ వ్యాధిని నివారిస్తుందే తప్ప చికిత్స కాదు లేదా వ్యాక్సిన్ కాదు. ఇది త్వరలో మార్కెట్లోకి రానుంది.