కొత్తిమీర ఫ్రెష్‌గా ఉండాలా.. అయితే తప్పక పాటించాల్సిన టిప్స్ ఇవే
Samatha
29 August 2026
ప్రతి ఒక్కరి వంటి ఇంట్లో ఆకు కూరల్లో కొత్తిమీర, కరివేపాకు తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా కొత్తిమీర లేని వంటిల్లు ఉండదు.
అయితే కొన్ని సార్లు కొత్తిమీర తెచ్చిన వెంటనే త్వరగా పాడవుతుంది. మరి అలా కొత్తి మీర త్వరగా పాడవకుండా ఫ్రెష్‌గా ఉండాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో చూద్దాం.
కొత్తిమీరను మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత వాటి కొత్తిమీరలో పసుపు రంగులోకి మారిన ఆకులు ఉంటే వాటిని వెంటనే తుంచి వేసి, ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవాలి.
అదే విధంగా కొందరు కొత్తిమీర తీసుకొచ్చిన వెంటనే దానిని నీటిలో కడిగి శుభ్రం చేస్తారు కానీ అలా చేయకూడదు. దానిని ఒక టిష్యూ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి
అదే విధంగా కొత్తిమీరను చిన్న చిన్న ఆకులు కట్ చేసి, వాటిని గాలి చొరబడని డబ్బాలో వేసి, ఒక బాక్స్‌లో స్టోర్ చేయాలి. అప్పుడు కొత్తిమీర ఫ్రెష్‌గా ఉంటుంది.
ఎప్పుడూ కూడా ఫ్రిజ్‌లో కొత్తిమీర పెట్టే సమయంలో, ఉల్లిపాయలు, వెల్లుల్లి పక్కన కొత్తిమీర పెట్టకండి, వాటి ఘాటు వల్ల అది త్వరగా పాడైపోతుంది.
కొంత మంది కొత్తిమీరను కొనుగోలు చేసిన వెంటనే దాని వేర్లను తెలిగిస్తుంటారు. కానీ దాని వేర్లను తెలిగించకుండా కొత్తిమీర ఉంచడం వలన అది ఫ్రెష్‌గా ఉంటుంది.
ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే కొత్తిమీరను సన్నగా తరిగి ఐస్ ట్రేలో నీళ్లు పోసి ఫ్రీజ్ చేయండి. దీని వలన కొత్తిమీర ఎప్పుడూ తాజాగా ఉంటుంది.