రాఖీ పండుగ సందర్భంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విధుల్లో ఉన్న పోలీసులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. పండుగ రోజుల్లో కూడా కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజా రక్షణకు సేవలు అందిస్తున్న పోలీసుల సేవలను ఆమె కొనియాడారు. రాష్ట్ర మహిళల భద్రత, పోలీసు కుటుంబాల సంతోషం ఆమె ఆకాంక్షించారు.