సాయిపల్లవి ఛాన్స్ కొట్టేసిన రష్మిక మందన్నా.. మరో క్రేజీ ప్రాజెక్టులో నేషనల్ క్రష్

29  August 2026

Basha Shek

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

 ప్రస్తుతం రష్మిక రెండు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. భర్త విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తోందీ అందాల తార.

రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తోన్ ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీంతో పాటు మైసా అనే ఓ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో నటిస్తోంది రష్మిక. త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పుడు రష్మిక ఫిల్మోగ్రఫీలో మరో క్రేజీ ప్రాజెక్టు చేరింది. అది మరేదో కాదు సంగీత విద్వాంసురాలు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్

గతంలో ఈ పాన్ ఇండియాలో సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి నటించనుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ రష్మికకు వచ్చిందని టాక్.

 జెర్సీ, కింగ్ డమ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్, అలాగే రాక్‌లైన్ వెంకటేష్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ  మూవీని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.