PCC అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో టీవీ9 రజినీకాంత్ క్రాస్‌ఫైర్..
ఎన్నో హామీలు, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాటిల్లో ఎన్ని అమలు అవుతున్నాయి? మిగిలిన హామీల అమలు సాధ్యమేనా? పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. ప్రజాస్వామ్యం అంటే.. గ్రూపు తగాదాలు, కొట్లాటలు. పోటాపోటీ అవినీతేనా? తెలంగాణ ప్రజలు గెలిపించింది ఎందుకు? ఇప్పుడు అసలేం జరుగుతోందనే అంశంపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌తో క్రాస్‌ఫైర్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి కేబినెట్ విస్తరణ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. కేబినెట్‌లో మార్పులు ఉండబోతున్నాయా? అదే నిజమైతే.. ఎవరి పదవి ఉంటుందో, ఎవరికి పదవీ గండం పొంచి ఉందో ఇప్పుడు చర్చ జరుగుతోంది. మంత్రుల పనితీరు, సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాల ఆధారంగా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న ఆసక్తి కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు రాజ్యసభ పదవి విషయంలో ఏం జరిగింది? ఆమెకు పదవి దక్కకుండా తెరవెనుక ఎవరైనా కుట్రలు చేశారా? ప్రత్యర్థులకు కీలక సమాచారం చేరవేసిన లీకువీరులు ఎవరు? కాంగ్రెస్‌లో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
ఇదే సమయంలో కేబినెట్ విస్తరణపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌తో జరిగిన క్రాస్‌ఫైర్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కేబినెట్‌లో మార్పులు, మంత్రుల భవిష్యత్, పార్టీ అంతర్గత పరిణామాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ డిస్కషన్‌గా మారాయి. అసలు మహేష్‌కుమార్‌గౌడ్ ఏమన్నారు? కేబినెట్‌లో మార్పులపై ఆయన ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఎవరి పదవికి ముప్పు ఉందనే చర్చ ఎందుకు మొదలైంది? మీనాక్షి రాజ్యసభ వ్యవహారంలో తెరవెనుక ఏం జరిగిందనే ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఏమిటి? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..

