AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెరట్లో పొట్ట ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. ఎక్స్‌రేలో కనిపించింది చూసి..

పెరట్లో మొక్కలను నీళ్లు పోసేందుకు వెళ్లి ఓ మహిళకు ఊహించని పరిణామం ఎదురైంది. మొక్కల పక్కనే ఉన్న ఓ షెడ్డు కింద ఆమెకు ఓ భారీ కొండ చిలువ కనిపించింది. అయితే దాని పొట్ట పెద్దగా ఉబ్బి ఉండడాన్ని గమనించిన ఆమె అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు దాన్ని స్కాన్ చేసి చూడగా షాకింగ్ దృశ్యాలు వెలుగు చూశాయి.

Viral Video: పెరట్లో పొట్ట ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. ఎక్స్‌రేలో కనిపించింది చూసి..
New Jersey Python Rescue
Anand T
|

Updated on: Aug 09, 2026 | 11:25 AM

Share

పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తుండగా..8 అడుగుల భారీ బర్మీస్‌ కొండ చిలువ దర్శనమిచ్చిన ఘటన న్యూజెర్సీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా లెస్లీ డేలీ అనే తన భర్తతో కలిసి నివసిస్తోంది. అయితే ఆమె ఇటీవల తన ఇంటి తోటలో ఉన్న మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్లగా.. పక్కనే ఉన్న షెడ్డు కింద నుంచి ఏవో శబ్ధాలు వినిపించాయి. దీంతో ఏంటని తొంగి చూడగా.. అక్కడ ఓ 8 అడుగుల భారీ ‘బర్మీస్ కొండచిలువ’ కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన ఆమె వెంటనే కేకలు వేసింది.

అది విన్న ఆమె భర్త సైతం వెంటనే అక్కడికి చేరుకొన్నాడు. విషయం తెలుసుకొని వెంటనే మాన్మౌత్ కౌంటీ SPCA అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే హుటాహుటిన అక్కడి చేరుకున్న అధికారులు షెడ్డు కింద దాగి ఉన్న పామును బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ ఆ కొండ చిలువ దేన్నో తినడం కారణంగా దాని కడుపు భాగం బాగా ఉబ్బి పోయింది. దీంతో షెడ్డు కింద ఉన్న చిన్న రంధ్రం నుండి ఆ కొండ చిలువ బయటకు రాలేకపోయింది.

అయితే ఈ కొండచిలువకు ఎలాంటి గాయం కాకుండా బమటకు తీయాలని డేలీ కుటుంబం కోరింది. దీంతో ఒక కాంట్రాక్టర్ సాయంతో షెడ్ ఫ్లోర్ బోర్డులను పెకిలించిన అధికారులు, దాని చుట్టూ ఉన్న మట్టిని తవ్వి పామును సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం దాన్ని అక్కడి నుంచి తరలించారు. అయితే దాని పొట్టలో ఏముందో అని గుర్తించేందుకు అధికారులు ఎక్స్‌రే తియగా.. అది ఒక చిన్న క్షీదాన్ని మింగినట్లు గుర్తించారు. తర్వాత దాన్ని జూకు తరలించే ఏర్పాట్లు చేశారు.

అయితే డెలీ ఫ్యామిలీ నివపిస్తున్న ప్రాంతంలో బర్మీస్ కొండచిలువలు సహజంగా పెరగవని.. కొండచిలువను పెంచుకునే ఎవరైనా దాన్ని ఇక్కడ వదిలేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఇది ఎవరి పెంపుడు జంతువులను తినకపోవడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారని అధికారులు తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us